బ్రిస్బేన్‌లో ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ తొలి టెస్టుకు ఆసీస్ వైస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నడుము నొప్పి గాయం కారణంగా మైకేల్ క్లార్క్ తొలి టెస్టులో ఆడే అవకాశం లేదని, క్లార్క్‌కు బదులుగా కవాజాను సెలక్టర్లు ఎంపిక చేసినట్లు తెలిసింది.
సోమవారం జరిగిన ప్రాక్టీస్‌లో మైకేల్ క్లార్క్ పాల్గొనలేదు. క్లార్క్ గాయం తీవ్రతను తగ్గించేందుకు వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సీఏ వర్గాల సమాచారం. గాయం కారణంగా చికిత్స పొందుతున్న మైకేల్ క్లార్క్ యాషెస్ తొలి టెస్టు మ్యాచ్‌లో పాల్గొంటాడా లేదా అనే అంశంపై సంశయం నెలకొంది.