Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెజిల్ అమ్మాయితో ఉసేన్ బోల్ట్ రాసలీలలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో పతకాలతో మంచి పేరు కొట్టేసిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ వివాదంలో చిక్కుకున్నాడు. బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ చేసిన రాసలీలల ఫోటోలు బయటికి పొక్కడంతో ఉసేన్ బోల్ట్ ఇమేజ్ డామేజ్

Advertiesment
Usain Bolt Parties with 10 Women in London After Rio Olympics
, గురువారం, 25 ఆగస్టు 2016 (17:10 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో పతకాలతో మంచి పేరు కొట్టేసిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ వివాదంలో చిక్కుకున్నాడు. బ్రెజిల్ అమ్మాయితో బోల్ట్ చేసిన రాసలీలల ఫోటోలు బయటికి పొక్కడంతో ఉసేన్ బోల్ట్ ఇమేజ్ డామేజ్ అయ్యింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. వరుసగా మూడు ఒలింపిక్స్ ఈ వెంట్లలో అదీ స్ప్రింట్‌లోనూ మూడేసి పసిడి పతకాల చొప్పున మొత్తం తొమ్మిది పతకాలు గెలిచి రికార్డు సృష్టించిన జమైకా చిరుత.. ఆ విజయాన్ని సంబరాలు చేసుకోవాలనుకున్నాడు.
 
సక్సెస్‌ను సంబరాలు చేసుకోవడం ఏదో తప్పతాగి చిందులేసివుంటే పోయేది.. అయితే ఉస్సేన్ బోల్ట్ కాస్త ఓవరాక్షన్ చేశాడు. రియో ఒలింపిక్సే తనకు చివరి ఒలింపిక్స్ అని ప్రకటించిన బోల్ట్.. బుధవారం తన 30వ పుట్టినరోజు జరుపుకున్నాడు. బర్త్ డేను సన్నిహితులు, స్నేహితులతో కలిసి మస్తుగా ఎంజాయ్ చేశాడు. పార్టీ అయ్యాక బ్రెజిల్ అమ్మాయితో రాసలీలలు జరిపి బుక్కయ్యాడు. 
 
బ్రెజిల్ అమ్మాయి జాడీ డ్యురేట్ (20)తో బుధవారం రాత్రి బోల్ట్ రాసలీలలు సాగించాడు. ఇందుకు సాక్ష్యం డ్యురేట్ తన వాట్సప్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఫొటోలే. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌గా మారాయి. బోల్ట్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోతేపో కశ్యప్ అంటున్నారా గోపీచంద్... స్టార్ షట్లర్ కశ్యప్ బెంగళూరుకు మకాం మార్చాడు... ఎందుకు?