Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామన్వెల్త్ గేమ్స్‌లో చొక్కాపట్టుకున్న క్రీడాకారులు (video)

CWG fight
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (21:55 IST)
CWG fight
కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా.. హాకీ మ్యాచ్‌ జరుగుతుండంగానే మధ్యలో కుస్తీ పోటీలు జరిగాయి. అది కూడా ప్రొఫెషనల్ రెజ్లర్ల లాగా ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. గొంతు, జెర్సీలు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లారు. పురుషుల హాకీ మ్యాచ్‌లో భాగంగా గురువారం ఆతిథ్య ఇంగ్లాండ్​-కెనడా జట్ల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. 
 
కాగా కెనడా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్​ స్థానం ఖాయమైంది. అయినా ఇంగ్లిష్‌ జట్టు దూకుడుగా ఆడింది. రెండవ క్వార్టర్ ముగిసే సమయానికి కెనడాపై 4-1 ఆధిక్యం సాధించింది. అయితే ఇదే సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
 
కాగా మ్యాచ్‌ మధ్యలోనే గొడవకు దిగిన ఆటగాళ్లపై రెఫరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనేసర్‌కు రెడ్ కార్డ్ చూపించి మ్యాచ్ నుంచి బయటకు పంపాడు. గ్రిఫిత్స్‌కు కూడా ఎల్లో కార్డు కూడా చూపించాడు. 
 
కాగా గ్రిఫిత్స్ మొదట జెర్సీని పట్టుకున్నప్పటికీ, పనేసర్ ఏకంగా గొంతు పట్టుకున్నాడు. అందుకే అతనికి రెడ్‌కార్డ్‌ చూపించి బయటకు పంపించారు రెఫరీ. కాగా ఈ గొడవతో కెనడా అన్ని విధాలా నష్టపోయింది. అప్పటికే 1-4తో వెనుకబడిన జట్టు చివరికి 2-11తో దారుణంగా ఓడిపోయింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామన్వెల్త్ క్రీడలు.. భారత్‌కు ఐదో స్వర్ణం.. టేబుల్ టెన్నిస్‌లో..?