Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినోద్ కుమార్‌కు రజత పతకం గెలిచారా? లేదా? మెడల్ ఇవ్వని నిర్వాహకులు!

Advertiesment
వినోద్ కుమార్‌కు రజత పతకం గెలిచారా? లేదా? మెడల్ ఇవ్వని నిర్వాహకులు!
, సోమవారం, 30 ఆగస్టు 2021 (08:27 IST)
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన పలు ఈవెంట్లలో భారత్‌కు వరుసగా మూడు పతకాలు వచ్చాయి. వీటిలో ఒకటి టేబుల్ టెన్నిస్ కాగా, రెండోది హైజంప్ విభాగం. చివరగా డిస్కస్ త్రోలో భారత అథ్లెట్‌ వినోద్‌ కుమార్‌ పురుషుల ఎఫ్52 డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో కాంస్యం సాధించాడు. అయితే, ఆయనకు నిర్వాహకులు మాత్రం పతకం ఇంకా అందజేయలేదు. అందుకే అతని ఫలితాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. 
 
ఇతర పోటీదారులు వినోద్ వర్గీకరణపై నిరసన తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై పునః సమీక్ష జరిపిన అనంతరం సోమవారం సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. 
 
పారాలింపిక్స్‌లో క్రీడల ప్రారంభోత్సవానికి ముందే అథ్లెట్ల అవయవలోప శక్తి సామర్థ్యాల ఆధారంగా వారిని వివిధ కేటగిరీలుగా వర్గీకరణ చేస్తారు. ఒకే స్థాయి శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని సంబంధిత ఈవెంట్లకు ఎంపిక చేస్తారు.
 
ఈ క్రమంలోనే ఈనెల 22న వినోద్‌ను పరీక్షించిన నిర్వాహకులు ఎఫ్52 డిస్కస్‌త్రో ఈవెంట్‌కు ఎంపిక చేశారు. పోటీల్లో పాల్గొని 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ త్రో చేసి కాంస్యం కైవసం చేసుకున్నాడు. అలాగే పోలాండ్‌కు చెందిన పీయోటర్‌ కోసెవిక్జ్‌ 20.02 మీటర్లతో స్వర్ణం సాధించగా.. క్రోయేషియాకు చెందిన వెలిమిర్‌ సాండర్‌ 19.98 మీటర్లతో రజతం దక్కించుకున్నాడు. 
 
అయితే, ఇతర పోటీదారులు వినోద్‌పై నిరసన తెలపడంతో నిర్వాహకులు పతకాల బహూకరణ నిలిపివేశారు. ఈ ఎఫ్52 ఈవెంట్‌లో బలహీనమైన కండరాల శక్తి కలిగిన అథ్లెట్లతో పాటు పరిమిత కదలిక అవయవలోపం ఉన్నవాళ్లు, కాళ్ల పొడవు వ్యత్యాసం ఉన్నవాళ్లు, వెన్నెముక సరిగా లేనివాళ్లు, క్రియాత్మక రుగ్మతతో కూర్చున్న స్థితిలో ఉన్న అథ్లెట్లు మాత్రమే పాల్గొంటారు. ఇందులో వినోద్‌ను ఏ విధంగా ఎంపిక చేశారనేది స్పష్టత లేదు. ఈ విషయంలోనే ప్రత్యర్థులు అభ్యంతరం తెలుపడుతో అతనికి పతకాన్ని ఇవ్వకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిస్కస్ త్రోలో భారత్‌కు కాంస్య పతకం