Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనా సూపర్ సిరీస్ విజేతగా పీవీ సింధు: కెరీర్‌లో తొలిసారి.. సూపర్ సిరీస్ టైటిల్

భారత స్టార్ షట్లర్, తెలుగమమ్మాయి పీవీ సింధు తన కెరీర్‌లో తొలిసారి సూపర్ సిరీస్ టిటైల్‌ను సాధించింది. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఊపుమీదున్న పీవీ సింధు.. మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. చైనా ఓపెన్ స

Advertiesment
PV Sindhu wins maiden China Open Super Series title
, ఆదివారం, 20 నవంబరు 2016 (14:20 IST)
భారత స్టార్ షట్లర్, తెలుగమమ్మాయి పీవీ సింధు తన కెరీర్‌లో తొలిసారి సూపర్ సిరీస్ టిటైల్‌ను సాధించింది. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఊపుమీదున్న పీవీ సింధు.. మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో ప్రత్యర్థి పై విజయం సాధించింది. ఆదివారం జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో పదకొండో ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11 తేడాతో తొమ్మిదో ర్యాంకర్ సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
తొలి గేమ్‌‍ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌ను చేజార్చుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది మూడు గేమ్‌ల్లోను ధీటుగా రాణించిన సింధు విజేతగా నిలిచింది. మూడో గేమ్‌లో మాత్రం దాదాపు ఆరు పాయింట్ల వరకూ సింధు-సున్ యులు సమంగా నిలిచి మ్యాచ్‌పై ఆసక్తిని రేపారు. ఆ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోలో గెలుపును నమోదు చేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ టెస్టు: వరుసగా పెవిలియన్ క్యూ కట్టిన బ్యాట్స్‌మెన్లు.. 204 పరుగులకే భారత్ ఆలౌట్..