Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌ వినేష్ ఫోగట్ రికార్డ్

vinesh phogat

ఐవీఆర్

, మంగళవారం, 6 ఆగస్టు 2024 (23:31 IST)
వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌‌గా ఆమె రికార్డు సృష్టించారు. మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆమె 5-0తో క్యూబాకు చెందిన లోపెజ్ గుజ్మాన్‌ను ఓడించింది. తొలి రౌండ్ వరకు వినేష్ 1-0తో ముందంజలో ఉన్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో ఫైనల్‌ చేరిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా వినేష్‌ ఫోగట్‌ నిలిచింది. ఈ ఫీట్‌ను ఇంతకుముందు ఎవరూ చేయలేకపోయారు.
 
గాయం కారణంగా రియో ​​ఒలింపిక్స్ నుంచి వైదొలిగి, ఆపై టోక్యో ఒలింపిక్స్‌లో 16వ రౌండ్‌లో నిష్క్రమించిన వినేష్ ఈ ఏడాది తన ప్రతిభను ప్రపంచానికి చాటారు. తన తొలి మ్యాచ్‌లో, క్వార్టర్స్‌లో వినేష్ 3-2తో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత సుసాకిని ఓడించింది. ఆపై క్వార్టర్ ఫైనల్స్‌లో 7-5తో ఒక్సానాను ఓడించింది. ఇప్పుడు సెమీ ఫైనల్‌లో 5-0తో ఫైనల్‌కు చేరుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్ స్నేహితుడు అలా నిలబడలేకపోతున్నాడే.. ఏమైంది? (video)