జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నీ: యూపీకి రానున్న పాకిస్థాన్.. ముంబై పేలుళ్ల తర్వాత?
భారత్‌లో నిర్వహించే జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నీలో దాయాది దేశమైన పాకిస్థాన్ పాల్గొననుంది. ముంబై పేలుళ్ల అనంతరం సుదీర్ఘ కాలంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రీడా పోటీలు జరగని నేపథ్యంలో.. భారత్‌లో నిర్వహి
భారత్‌లో నిర్వహించే జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నీలో దాయాది దేశమైన పాకిస్థాన్ పాల్గొననుంది. ముంబై పేలుళ్ల అనంతరం సుదీర్ఘ కాలంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రీడా పోటీలు జరగని నేపథ్యంలో.. భారత్‌లో నిర్వహించే జూనియర్ హాకీ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనేందుకు పాక్ భారత్‌లో ఆడనుంది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో డిసెంబర్ 8-18 వరకు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న పాక్ హాకీ సమాఖ్యకు ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది.
పాకిస్థాన్ జూనియర్ జట్టు లఖ్‌నవూ రావడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్‌లో నిర్వహిస్తున్న జూనియర్ హాకీ ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇచ్చినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపిందని పాకిస్థాన్ హాకీ సమాఖ్య వెల్లడించింది. ఇంకా తమ జట్టు ఈ టోర్నీలో మెరుగ్గా ఆడుతుందని పాకిస్థాన్ హాకీ తెలిపింది.