Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డేవిస్ కప్‌లో నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఎంపికైన మహేష్ భూపతి.. పేస్‌ను పక్కనబెట్టారా?

భారత స్టార్ ఆటగాడు మహేష్ భూపతి డేవిస్ కప్‌లో భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా నియామకం అయ్యాడు. ప్రస్తుత కెప్టెన్‌ ఆనంద్‌ అమృత్‌రాజ్‌ నుంచి ఫిబ్రవరి 2017లో బాధ్యతలు స్వీకరిస్తాడు. గురువారం సమావేశమ

Advertiesment
Mahesh Bhupathi To Succeed Anand Amritraj As India's Davis Cup Captain
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (09:37 IST)
భారత స్టార్ ఆటగాడు మహేష్ భూపతి డేవిస్ కప్‌లో భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా నియామకం అయ్యాడు. ప్రస్తుత కెప్టెన్‌ ఆనంద్‌ అమృత్‌రాజ్‌ నుంచి ఫిబ్రవరి 2017లో బాధ్యతలు స్వీకరిస్తాడు. గురువారం సమావేశమైన ఆల్‌ఇండియా టెన్నిస్‌ సమాఖ్య పుణెలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు జరిగే డేవిస్‌ కప్‌లో పాల్గొనే సభ్యులు వివరాలను వెల్లడించింది. 
 
లియాండర్‌ పేస్‌, సాకేత్‌ మైనేని, రామ్‌కుమార్‌ రామనాథన్‌, యాకీ బాంబ్రీ, ప్రగ్నేష్‌ గుణేశ్వరన్‌ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. గ్రూప్‌ 1 తొలి రౌండ్‌ టై అనంతరం తుది పర్యటన వివరాలను విడుదల చేస్తామని ఐటా వెల్లడించింది. అప్పటిదాకా అమృత్‌రాజ్‌ కెప్టెన్‌గా, జీషన్‌ అలీ కోచ్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. కెప్టెన్‌ ఎంపిక విషయంలో లియాండర్‌ పేస్‌తో సహా ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని ఐటా సెక్రటరీ హిరన్మయి ఛటర్జీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2016గా రవిచంద్రన్ అశ్విన్