పాపులర్ రియాల్టీ షోలో తాను పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలపై బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్‌లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా గుత్తా జ్వాలా ఈ విషయాన్ని తెలియజేసింది.
ఇకపోతే.. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌గా నాగార్జున సెలెక్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇక హౌస్‌లో అడుగుపెట్టబోయే పార్టిసిపేట్స్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఇంతవరకు గుత్తా జ్వాలా పేరు వినబడింది.
అయితే తాను బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోయేది లేదని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. మరి వరుణ్ సందేశ్, ఆర్జే హేమంత్, యాంకర్ శ్రీ ముఖి కూడా బిగ్ బాస్-3లో మెరవనున్నట్లు టాక్ వస్తోంది. అయితే వీరి పార్టిసిపెంట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.