చైనాలో హాంగ్జౌ నగరంలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు రాణించారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో తొలి రోజునే ఏకంగా ఐదు బంగారు పతకాలను సాధించారు.
ఆదివారం జరిగిన ఈవెంట్లలో ఐదు పతకాలను కైవసం చేసుకున్నారు. రోయింగ్‌లో మూడు, షూటింగులో రెండు పతకాలు నెగ్గారు. ఇందులో మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. మహిళల 10 మీటర్ల రైపిల్ టీమ్ ఈవెంట్‌లో మొహాలీ ఘోశ్, రమిత, అషిచౌక్సితో కూడిన భారత జట్టు రజతం సాధించింది.
ఇదే ఈవెంట్‌లో వ్యక్తిగత విబాగంలో రమిత కాంస్య పతకం గెలిచింది. రోయింగ్ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో అర్జున్ లాల్ - అర్వింద్ సింగ్ జోడీ వెండి పతకం నెగ్గింది. పురుషుల పెయిర్ పోటీలో బాబు లాల్ యాదవ్ - లేఖ్ రామ్ జంట కాంస్యం గెలిచింది. పురుషుల వెయిట్ పోటీల్లో భారత జట్టు మరో రజతం సొంతం చేసుకుంది.