Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒలింపిక్ క్రీడోత్సవాలకు ఆకర్షణగా చిరుతపులిని తెచ్చుకున్నారు.. కానీ కాల్చి చంపేశారు!

ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడోత్సవాలు మొదలుకాకముందే ఒలింపిక్ నిర్వాహకులు చిక్కుల్లో పడ్డారు. ఒలింపిక్స్ సన్నాహాలను ఘనంగా నిర్వహిస్తున్న బ్రెజిల్‌లో టార్చ్ వేడుకలు జరుగుతున్న వేళ, ఆకర్షణీయత కోసం తెచ్చిన

Advertiesment
Amazon jaguar
, గురువారం, 23 జూన్ 2016 (15:08 IST)
ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడోత్సవాలు మొదలుకాకముందే ఒలింపిక్ నిర్వాహకులు చిక్కుల్లో పడ్డారు. ఒలింపిక్స్ సన్నాహాలను ఘనంగా నిర్వహిస్తున్న బ్రెజిల్‌లో టార్చ్ వేడుకలు జరుగుతున్న వేళ, ఆకర్షణీయత కోసం తెచ్చిన చిరుతపులిని కాల్చి చంపేశారు. అయితే అనుకోకుండా జరిగిన ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... ఒలింపిక్స్ పోటీలకు బ్రెజిల్ టీం అధికారిక మస్కట్‌గా జాగ్వార్ (చిరుతపులి) గుర్తించి దానికి 'జింగా' అని పేరు పెట్టారు. ఆ ఈవెంట్‌లో భాగంగా మస్కట్ కూడా ఉండాలని భావించిన అధికారులు చిరుతపులిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 
 
ఏమైందో ఏమోగాని ఉన్నట్టుండి చిరుతపులి ఓ సైనికుడిపై దాడికి దిగింది. దానిని అదుపుచేయ‌డానికి ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని సైనికుడు దాన్ని పిస్ట‌ల్‌తో కాల్చేశాడు. అయితే ఈ ఘ‌ట‌న‌పై మండిపడ్డ జంతు ప్రేమికులు.. జంతువుల‌ను బంధించి వాటిచేత చేయ‌కూడ‌ని ప‌నులు చేయిస్తూ వాటిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నారని, ఫలితంగా అవి దాడి చేస్తే చంపేస్తున్నార‌ని విమ‌ర్శల వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన రియో ఒలింపిక్స్ నిర్వాహ‌కులు ఇలాంటి ఘటన మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఒలింపిక్స్ పోటీలను వైభవంగా నిర్వహించాలని భావిస్తుంటే, అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటం, దేశం పరువును తీసిందని బ్రెజిల్ వాసులు అభిప్రాయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జింబాబ్వేతో హరారే మ్యాచ్.. ఎరుపెక్కిన కంటితో ధోనీ ఫోటో.. కూల్ కెప్టెన్‌కు ఏమైంది..?!