Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్ఫింగ్ చేస్తుండగా అగ్నిపర్వతం బద్ధలైంది... ఆమె ఎలా తప్పించుకుందో చూడండి (థ్రిల్లింగ్ వీడియో)

సాధారణంగా అగ్నిపర్వతాలు ఉన్నచోటికి వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి సాహసం చేయాల్సిందే. కానీ, ఓ సర్ఫింగ్ క్రీడాకారిణి మాత్రం... నింపాదిగా సముద్రాన్ని ఈదుకుంటూ ఒడ్డు చేరుకుంది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ల

సర్ఫింగ్ చేస్తుండగా అగ్నిపర్వతం బద్ధలైంది... ఆమె ఎలా తప్పించుకుందో చూడండి (థ్రిల్లింగ్ వీడియో)
, గురువారం, 11 ఆగస్టు 2016 (17:38 IST)
సాధారణంగా అగ్నిపర్వతాలు ఉన్నచోటికి వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి సాహసం చేయాల్సిందే. కానీ, ఓ సర్ఫింగ్ క్రీడాకారిణి మాత్రం... నింపాదిగా సముద్రాన్ని ఈదుకుంటూ ఒడ్డు చేరుకుంది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. హవాయ్ దీవుల్లో కిలౌయా అగ్నిపర్వతం బద్దలైంది. సరిగ్గా ఆ సమయంలో అగ్నిపర్వతానికి అత్యంత సమీపంలో సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న అలిసన్ తీల్ అనే సర్ఫింగ్ సాహస క్రీడాకారిణి మాత్రం మిగతా అందరిలా బెదిరిపోలేదు. తొణకలేదు. 
 
నిజానికి ఈ దృశ్యం చూసి థ్రిల్‌గా ఫీలైంది. ఆ తర్వాత నెమ్మదిగా తేరుకున్న అలిసన్... సర్ఫింగ్ చేస్తూ ఒడ్డుకు చేరుకుంది. అదేసమయంలో పెరిన్ జేమ్స్ అనే ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ దీన్ని వీడియో తీశాడు. అలిసన్ అడ్వెంచర్స్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విడియోను అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది నెటిజన్లు ఈ థ్రిల్ వీడియోను వీక్షించి.. అలిసన్ ధైర్యసాహసాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియో ఒలింపిక్స్ : భారత్ ఖాతాలో పతకాలు 0.. ర్యాంకుల లిస్ట్‌లో స్థానమెంతో తెలుసా?