Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 28వ తేదీ నుంచి ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్

Advertiesment
అథ్లెటిక్
File
FILE
ఈనెల 28వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు 59వ ఆల్ ఇండియా పోలీసు అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రోతక్‌లో ఈ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

దీనిపై పోలీసు శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఈవెంట్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సెంట్రల్ పారామిలిటరీ ఆర్గనైజేషన్ సంస్థలకు చెందిన 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఆటగాళ్లలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను కూడా చేర్చుతామన్నారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్ క్రీడలు, ఇతర అంతర్జాతీయ ఈవెంట్స్‌లలో పాల్గొన్న వారు ఉంటారన్నారు.

ఈ టోర్నీలో ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్, హాకీ ప్లేయర్ మంతా ఖరాబ్, ఇతర స్పోర్ట్స్ పర్సన్‌లు ఉంటారని ఆయన వివరించారు. వీరిద్దరు హర్యానా పోలీసు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu