పడుపు వృత్తిలో నిమగ్నమైన వారిలో 40 వేల మంది సెక్స్‌వర్కర్లు ఒకే చోట దర్శనమివ్వనున్నారు. పలు ప్రపంచ దేశాల్లో వ్యభిచారానికి ప్రభుత్వ అనుమతి ఉన్న విషయం తెల్సిందే. ఇలాంటి దేశాల్లో లైసెన్స్ సెక్స్ వర్కర్లు పురుష పుంగవులను తమ శృంగార చేష్టలతో సంతృప్తి పరుస్తూ.. రెండు చేతులో అర్జిస్తున్నారు.
ఇలాంటి వారంతా ఒకే చోట చేరితే ఆ ప్రాంతం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ ప్రాంతమే దక్షిణాఫ్రికా. ఈ గడ్డపై త్వరలో ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నీ జరుగనుంది. ఇందుకోసం దక్షిణాఫ్రికాలోని వివిధ ప్రాంతాలు ముస్తాబయ్యాయి. ఈ టోర్నీలో పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు.
ఈ ఫుట్‌బాల్ కప్ క్రీడలను తిలకించేందుకు వివిధ దేశాలకు చెందిన క్రీడాభిమానులు దక్షిణాఫ్రికాకు తరలి రానున్నారు. వీరిని ఆహ్లాదపరిచేందుకు సెక్స్ వర్కర్లు కూడా ఈ ఆఫ్రికా దేశానికి తరలిస్తున్నారు. ఇలాంటి వారు తమకు అనుకూలమైన హోటల్స్ గదులను ఇప్పటికే బుక్ చేసుకున్నారు.
కాగా, ప్రపంచ ఫుట్ బాల్ క్రీడలను తిలకించేందుకు సుమారు మూడు నాలుగు లక్షల మంది విదేశీయులు వస్తారని ఆతిథ్య నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అదేసమయంలో వివిధ దేశాలకు చెందిన సెక్స్ వర్కర్లు కూడా 40 వేల మంది దక్షిణాఫ్రికాకు చేరుకోనున్నారు.
ఫుట్‌బాల్ కప్ నిర్వహణ సమయంలో భారీ ఎత్తున వ్యాపారం జరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ వ్యభిచార వృత్తిలోకి వచ్చే పలువురు యువతులు పలు పేద దేశాలకు చెందిన వారు కూడా ఉండటం గమనార్హం.