Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్యాంగ ప్రతులెన్ని వున్నాయి? 26నే ఎందుకు జరుపుకోవాలి?

భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు గణతంత్ర రాజ్యంగాన్ని నిర్మించడం జరిగింది.

రాజ్యాంగ ప్రతులెన్ని వున్నాయి? 26నే ఎందుకు జరుపుకోవాలి?
, గురువారం, 25 జనవరి 2018 (15:39 IST)
భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు గణతంత్ర రాజ్యంగాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి రాజ్యాంగ నిర్మాణం జరిగింది.
 
అలాంటి రాజ్యాంగ అసలు ప్రతులు ప్రస్తుతం కేవలం రెండంటే రెండే ఉన్నాయి. వీటిలో ఒకటి హిందీలో ఉండగా, మరొకటి ఆంగ్లంలో ఉంది. ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌ కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచివున్నారు. వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. 
 
అయితే, జనవరి 26నే ఎందుకు అమల్లోకి తెచ్చారు? అనే అంశాన్ని పరిశీలిస్తే, బ్రిటీష్ పాలనలోనే అంటే 1929, డిసెంబర్ 19వ తేదీన చారిత్రాత్మక భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు జరిగింది. ఇందులో పూర్ణ స్వరాజ్ కోసం పోరాటం చేయాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత లాహోర్ వేదికగా జరిగిన సమావేశంలో మహాత్మా గాంధీ 1929 డిసెంబర్ 31వ తేదీన మూడు రంగుల భారత జెండాను ఎగురవేశారు. 
 
ఆ సమావేశంలోనే 1930 జనవరి 26వ నుంచే సంపూర్ణ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి భారత కాంగ్రెస్ ఓ తీర్మానం చేసింది. ఆ మేరకు అన్ని రాజకీయ పక్షాలు, ఉద్యమకారులు ఆ రోజును సగర్వంగా పూర్ణస్వరాజ్‌గా జరుపుకోవడానికి ఏకతాటిపైకి వచ్చారు. అందుకే ఆ రోజును పురస్కరించుకుని రాజ్యాంగాన్ని జనవరి 26వ తేదీనే అమల్లోకి తెచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కుర్చీలో బాలయ్య కూర్చున్నారా? ఏం జరుగుతోంది?