Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

IRCTC హైదరాబాద్ నుంచి గంగా గయ టూర్ ప్యాకేజీ.. ధర రూ.24,660లు

IRCTC హైదరాబాద్ నుంచి గంగా గయ టూర్ ప్యాకేజీ.. ధర రూ.24,660లు
, బుధవారం, 11 ఆగస్టు 2021 (14:57 IST)
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ యాత్రలకు వెళ్లలేని పర్యాటకుల కోసం టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. లేటెస్ట్‌గా హైదరాబాద్ నుంచి గంగా గయ యాత్ర టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

ఈ టూర్ ప్యాకేజీలో బోధ్‌గయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్ కవర్ అవుతాయి. ఫ్లైట్‌లో పర్యాటకుల్ని తీసుకెళ్తుంది. 2021 సెప్టెంబర్ 22నఈ టూర్ మొదలవుతుంది. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
 
Day 1: సెప్టెంబర్ 22 ఉదయం 6.25 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.30 గంటలకు గయ చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత మహాబోధి ఆలయం, పరిసర ప్రాంతాల్లోని బౌద్ధ ఆలయాలు సందర్శించొచ్చు. రాత్రికి బోధ్ గయలోనే బస చేయాలి.
 
Day 2: రెండోరోజు తెల్లవారుజామున విష్ణుపాదం ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత వారణాసికి బయల్దేరాలి. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.
 
Day 3: మూడో రోజు కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి ఆలయం, భూ ఆలయం సందర్శించాలి. సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.
 
Day 4: నాలుగో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. త్రివేణి సంగమం, అలోపి దేవీ ఆలయం, ఆనంద్ భవనం సందర్శించొచ్చు. ఆ తర్వాత వారణాసికి తిరిగి రావాలి. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.
 
Day 5: ఐదో రోజు ఉదయం గంగా స్నానానికి వెళ్లొచ్చు. మధ్యాహ్నం సార్‌నాథ్‌కు బయల్దేరాలి. దమేఖ్ స్తూపాన్ని సందర్శించాలి. రాత్రి 8 గంటలకు వారణాసిలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 10.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
 
ఐఆర్‌సీటీసీ గంగా గయ యాత్ర టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.24,660. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.25,450, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,020 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి గయకు, వారణాసి నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్ టికెట్స్, ఒక రోజు బోధ్ గయలో బస, మూడు రోజులు వారణాసిలో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాకు నిశ్చితార్థం అయిపోయింది.. ఇదిగోండి రింగ్.. సిగ్గుపడుతూ నయనతార