తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా ఉంది. రెండు రోజులుగా తిరుమలలో రద్దీ కనిపిస్తోంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శనం 8 గంటలకుపైగా పడుతోంది. కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటలకుపైగా సమయం పడుతోంది.
గదులు సులువుగానే భక్తులకు లభిస్తున్నాయి. వీఐపీలు బసచేసే పద్మావతి అతిథి గృహం వద్ద మాత్రం గదులు ఖాళీ లేవు. 50, 100రూపాయల గదులు భక్తులకు లభిస్తున్నాయి. మంగళవారం శ్రీవారిని 75,277 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2.03 లక్షల రూపాయలు లభించింది.