తిరుమల శ్రీవారికి భుజకీర్తులు - విలువెంతో తెలుసా...!
కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్నకు కానుకలకు కొదవేలేదు. ఇది ఇప్పటి కాదు. ఎప్పటి నుంచో ఉంది. శ్రీవారిని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు స్వామివారిపై భారం వేసి అద
కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్నకు కానుకలకు కొదవేలేదు. ఇది ఇప్పటి కాదు. ఎప్పటి నుంచో ఉంది. శ్రీవారిని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు స్వామివారిపై భారం వేసి అది నెరవేరితే మ్రొక్కులు కూడా తీర్చేసుకుంటుంటారు. అది కానుకల రూపంలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే స్వామివారి ఆస్తులు వెలకట్టలేనివి. టిటిడి స్వామివారి ఆస్తులు ఎంత ఉన్నాయో స్పష్టంగా కూడా చెప్పదు.
తిరుమల శ్రీవారి ఇప్పటికే కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాల కిరీటాలు, భుజకీర్తులు ఉన్నాయి. తాజాగా ఒక అజ్ఞాత భక్తుడు మరో భుజకీర్తులను కానుకగా సమర్పించారు. 2 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన వజ్రాలతో ఉన్న భుజకీర్తులను స్వామివారికి అందజేశారు భక్తుడు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తుడు ఆ కానుకను అందజేశారు. అయితే పేరును మాత్రం చెప్పడానికి భక్తుడు ఇష్టపడలేదు. ఈనెల 16వ తేదీన జరుగబోయే ఆణివార ఆస్థానం రోజున స్వామివారికి టిటిడి భుజకీర్తులను అలంకరించనుంది.