Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి చెంత అన్నీ తానై పెత్తనం చేస్తున్న ఓ అధికారి.. ఎవరు..?

దాదాపు రెండేళ్ళపాటు స్తబ్దుగా ఉన్న తిరుమల టిటిడి జెఈఓ శ్రీనివాసరాజు మళ్ళీ ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు. తిరుమలలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. కొత్తగా వచ్చిన ఈఓ సింఘాల్‌‍కు తితిదే వ్యవహారాలపై అవగాహన కల్పిస్తూ ఆయనతో చర్చిస్తూ కీలక నిర్ణయాలు తీస

Advertiesment
శ్రీవారి చెంత అన్నీ తానై పెత్తనం చేస్తున్న ఓ అధికారి.. ఎవరు..?
, శనివారం, 27 మే 2017 (13:37 IST)
దాదాపు రెండేళ్ళపాటు స్తబ్దుగా ఉన్న తిరుమల టిటిడి జెఈఓ శ్రీనివాసరాజు మళ్ళీ ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు. తిరుమలలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. కొత్తగా వచ్చిన ఈఓ సింఘాల్‌‍కు తితిదే వ్యవహారాలపై అవగాహన కల్పిస్తూ ఆయనతో చర్చిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాంబశివరావు బదిలీ తరువాత శ్రీనివాసరాజును గమనించిన వారికి ఎవరికైనా ఇది అర్థమవుతుంది. 
 
తిరుమల జెఈఓగా విశేషమైన అనుభవం సొంతం చేసుకున్న శ్రీనివాసరాజు గడిచిన రెండేళ్ళలో విధి నిర్వహణలో అంత చురుగ్గా లేరనే చెప్పాలి. సింఘాల్ ముందు ఈఓగా పనిచేసిన సాంబశివరావుతో పొడచూపిన విబేధాల వల్ల ఆయన అలా ఉండిపోయారు. సాంబశివరావు సర్వస్వం తానేగా వ్యవహరించారు. తిరుమలలో జరిగే వారపు సమావేశాల్లోను ఈఓ నేరుగా పాల్గొనడం మొదలుపెట్టడంతో సమీక్షల్లో జెఈఓ కూడా అందరి అధికారుల్లాగే ఒక అధికారిగా మిగిలిపోయారు. సాంబశివరావు, శ్రీనివాసరాజు మధ్య ప్రఛ్ఛన్న యుద్థం జరుగుతోందని తితిదేలో అందరూ బహిరంగానే మాట్లాడుకునేవారు. 
 
దాదాపు 20 రోజుల క్రితం ఈఓగా వచ్చిన అనిల్ కుమార్ సింఘాల్, సాంబశివరావు తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎవరి అధికారాలు వారు ఉపయోగించుకోండి. అందరూ బాగా పనిచేయాలి... అని అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ అవకాశాన్ని శ్రీనివాసరాజు బాగా వినియోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈఓతో చర్చిస్తూ కీలక నిర్ణయాలూ తీసుకుంటున్నారు. వేసవిలో శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని సాంబశివరావు ఉన్నప్పుడే నిర్ణయం తీసుకుని అమలు చేయడం మొదలుపెట్టారు. 
 
రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24,25తేదీల్లోనూ బ్రేక్ దర్శనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జెఈఓగా ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో తిరుగుతూ భక్తుల అవసరాలు తెలుసుకుంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల తిరుమల పర్యటన విజయవంతం చేశారు. వారపు సమీక్ష సమావేశాలను తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తన అధికారాలను సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. ఈఓకు, జెఈఓలకు మధ్య ఇదే సఖ్యత ఉంటే మంచి ఫలితాలు వస్తానయడంలో సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-06-17 రాశి ఫలితాలు.. సలహా ఇచ్చి చిక్కుల్లో పడతారు.. తస్మాత్ జాగ్రత్త