Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంగట్లో శ్రీనివాసుడు : రూ.10 వేలిస్తే బ్రేక్ దర్శనం

Advertiesment
అంగట్లో శ్రీనివాసుడు : రూ.10 వేలిస్తే బ్రేక్ దర్శనం
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (09:34 IST)
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఇపుడు అంగట్లో సరకుగా మారిపోయున్నారు. డబ్బులు చెల్లిస్తేచాలు.. ఆయన్ను తనివితీరా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కొత్త పాలక మండలి కల్పించింది. అంటే.. ఎవరు ఎక్కు డబ్బులు చెల్లిస్తే వారు అంత ఎక్కువగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. 
 
తితిదే బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సోమవారం తితిదే కొత్త పాలక మండలి సమావేశమైంది. ఈ జంబో పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. అవేంటో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
శ్రీవారి ట్రస్టుకు విరాళాలు ఇచ్చే వారికి వీఐపీ బ్రేక్ దర్శన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ముఖ్యంగా, కనీసం పది వేల రూపాయలు విరాళం ఇస్తే బ్రేక్‌ దర్శన భాగ్యం కల్పించనున్నారు. దీనిపై త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 
 
ఇకపోతే, తితిదే కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపు అంశంపై నివేదిక ఇవ్వాలని ఫైనాన్స్ కమిటీకి బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, టీటీడీ విద్యాసంస్థల అడ్మిషన్లలో 2020 నుంచి మేనేజ్‌మెంట్ కోటాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
మూడు కొత్త కళ్యాణ మండపాల నిర్మాణానికి టీటీడీ అంగీకారం తెలిపింది. అద్దె ప్రాతిపదికన 40 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు టీడీపీ పచ్చజెండా ఊపింది. వీటితో పాటు 1381 కేజీల బంగారం యేడాది కాలానికి బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అమరావతిలో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి కేటాయించిన నిధులను రూ.150 కోట్ల నుంచి రూ.30కోట్లకు కుదిస్తూ పాలక మండలి కొత్త నిర్ణయం తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-09-2019 మంగళవారం దినఫలాలు - రాబడికి మించిన ఖర్చులు...