సినీ నటుడు నాగార్జున, అమల దంపతులు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. ఆలయంలో టిటిడి అధికారులు ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. దర్సనం తరువాత ఆలయం బయటకు వచ్చారు నాగార్జున.
మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. మీడియా ఎలాంటి ప్రశ్నలు వేస్తుందోనన్న భయంతో నాగార్జున మీడియా ముందుకు రావడానికి ఆలోచించారు. అయితే మీడియా ప్రతినిధులు వదిలిపెట్టలేదు. చివరకు నాగార్జున మాట్లాడాల్సి వచ్చింది.
కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా శ్రీవారిని దర్సించుకోలేకపోయాయని..ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇంతలో మధ్యలో కొంతమంది భక్తులు నాగచైతన్య, సమంతలు విడిపోయిన దానిపై ఏం మాట్లాడుతాడో నాగార్జున అంటూ గుసగుసలాడుకున్నారు.
దీన్ని గమనించిన నాగార్జున వెంటనే తేరుకుని అమలను తీసుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు. తెలుగు సినీపరిశ్రమలో సమంత..నాగచైతన్య విడిపోయిన వ్యవహారం కాస్త పెద్ద దుమారాన్నే రేపుతున్న విషయం తెలిసిందే.