Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26న తిరుమల మలయప్పస్వామికి పుష్పయాగం

Advertiesment
తిరుమల
WD
అఖిలాండ బ్రహ్మాండనాయకుడు తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ఈ నెల 26వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నారు.

ఈ పుష్పయాగానికి 25వ తేదీన అంకురార్పణ చేస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంనాడు ప్రతిఏటా మలయప్ప స్వామికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.

ఆ రోజున యథావిధిగా రెండు అర్చన, నివేదన కైంకర్యాల తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని కళ్యాణ మంటపానికి వేంచేపు చేస్తారు. అక్కడ హోమాలు, స్నపన తిరుమంజనం పూర్తిచేసి, మధ్యాహ్నం వివిధ రకాల సుగంధభరిత పుష్పాలతో స్వామివారిని అర్చిస్తారు. ఈ సందర్భంగా పుష్పరాశి ఉత్సవర్ల హృదయభగం వరకు రాగానే వాటిని తొలగించి, అర్చన పునఃప్రారంభిస్తారు. ఇలా 20 పర్యాయాలు నిర్వహించి, హారతి సమర్పిస్తారు.

పుష్పయాగాన్ని పురస్కరించుకుని 25న తోమాల-అర్చన, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణలను, యాగంనాడు విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu