బెజవాడ దుర్గమ్మకు అశ్వనీదత్ విరాళం
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అందించారు. నవరాత్రుల్లో భాగంగా మూడో రోజైన సోమవారం అన్నపూర్ణమ్మగా అలంకృతమైన కనకదుర్గమ్మ తల్లిని రాష్ట్ర ఎంపీ రాయపాటి సాంబశివరావు, నిర్మాత అశ్వనీదత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అశ్వనీదత్ ఆలయ ఉన్నతాధికారులకు ఐదులక్షల రూపాయల చెక్కును విరాళంగా అందించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం అన్నపూర్ణమ్మగా దర్శనమిస్తోన్న కనకదుర్గను వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.