త్రయంబకేశ్వరుని దర్శించి.. తరించండి
, సోమవారం, 8 అక్టోబరు 2007 (18:41 IST)
శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాశిక్‌కు 35 కిలో మీటర్ల దూరంలోని ‘త్రయంబక్’ అనే ఓ కుగ్రామంలో వెలసి ఉంది. ఈ గ్రామంలో అడుగుపెట్టగానే మీరు ఆధ్యాత్మిక భావనకు లోనవుతారు. మహామృత్యుంజయ మంత్ర జపంతో అక్కడి వాతావరణం మొత్తం మారుమోగుతూ పూర్తి ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉంటుంది. ఆ గ్రామంలో ప్రవేశించి అలా కొద్ది దూరం నడిస్తే, మీకు ఆలయ ప్రధాన ద్వారం కనబడుతుంది.
ఆ ఆలయం యొక్క ప్రధాన భవనం ఇండో-ఆర్యన్ నాటి నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. గర్భగుడిలోకి ప్రవేశించిగానే, అక్కడ శివలింగానికి ఒకే ఆధారం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే శివలింగానికి మరింత చేరువై దగ్గరగా చూస్తే... ఆ ఆధారంలో అంగుళం సైజున్న మూడు చిన్నచిన్న శివలింగాలు గోచరిస్తాయి. ఆ మూడు శివలింగాలును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులుగా భావిస్తారు. ఉదయకాలపు ప్రార్థన అవగానే, ఐదు ముఖాలతో కలిగి ఉన్న పంచముఖ వెండి కిరీటాన్ని పరమేశ్వరుడు ధరిస్తాడు. ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
త్రయంబకేశ్వరుని ఆలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని 1755 నుంచి 1786 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు 31 ఏళ్లపాటు అప్పటి రాజు బాలాజీ పీష్వా (నానా సాహిబ్ పీష్వా) పునర్నిర్మాణం చేయించారు. ఈ దేవాలయ పునర్నిర్మాణానికి గాను అప్పట్లో ఆయన చాలా భారీ మొత్తాన్నే ఖర్చు చేశారు. ఈ ఖర్చు అక్షరాల 16 లక్షల రూపాయలు. త్రయంబకేశ్వరుని ఆలయం, గ్రామం... రెండూ బ్రహ్మగిరి పర్వత పాదంలో ఉన్నాయి. ఈ పర్వతాన్ని ఆ సర్వేశ్వరుని ‘అవతారం’గా భావిస్తారు. అంతేకాదు బ్రహ్మగిరి పర్వత ప్రాంతం పవిత్ర గోదావరి నదికి కేంద్ర బిందువు కూడా కావటం గమనార్హం.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.పురాణ గాథ ప్రకారం... పూర్వం, గౌతమ్ ఋషి కోరిక మేరకు త్రయంబక్ లో స్వామి వెలశాడని ప్రతీతి. వివరాలలోకి వెళితే.... గోవధ పాపపరిహారం నిమిత్తం, గౌతమి ఋషి శివుని గురించి బ్రహ్మాండమైన తపస్సు ఆచరించాడు. తన పాపపరిహారానికి గాను ఆ ప్రదేశంలో గంగను ప్రతిష్టించాల్సిందిగా కోరాడు. ఫలితంగా గోదావరి పుట్టింది. ఈ కారణంగానే గోదావరికి దక్షిణ గంగ అన్న పేరు సార్థమకమైనట్లు పురాణ కథనం.
అంతేకాదు ఋషి తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు, త్రినేత్రుని అవతారంతో త్రయంబకేశ్వరునిగా వెలశాడు. అందువల్లనే ఈ ప్రాంతానికి ‘త్రయంబక్’ అన్న పేరు వచ్చినట్లు చెపుతారు. ఉజ్జయిని, ఓంకారేశ్వర్ వలె త్రయంబకేశ్వరుడు కూడా ఆ నగరానికి రారాజు. ప్రతి సోమవారం త్రయంబకేశ్వర మహారాజు నగరాన్నంతా చుట్టివస్తాడు. ఈ సందర్శనలో త్రయంబకేశ్వరుడు పంచముఖాలతో కలిగిన స్వర్ణ తొడుగును ధరిస్తాడు. అలా రథంపై ఊరేగుతాడు. ఆ తర్వాత కుషావర్త్ కొనేటిలో స్వామివారు పుణ్య స్నానాలు ఆచరిస్తాడు.
ఈ మహోత్సవం శివరాత్రినాడు, శ్రావణ మాసంలో కన్నులపండువగా జరుగుతుంది. త్రయంబకేశ్వరంలో జరిగే ఈ ఉత్సవానికి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించి పరమేశ్వరుని దర్శించుకుని తరిస్తారు. త్రయంబకేశ్వర్ ‘నారాయణ్ నాగ్ బలి’ అన్న ప్రత్యేక పూజలకు కూడా ప్రసిద్ధి గాంచినది. కాలసర్పయోగం ఉన్నవారికి ఇక్కడ నివారణ జరుగుతుంది.ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.