మీరు చతుర్దశి గురువారం, తులా లగ్నము, అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉచ్చి చెందడం వల్ల మీకు మంచి యోగప్రదమైన కాలం. మీ 30 సంవత్సరము నుంచి ప్రారంభమవుతుంది.
ధన భర్తకారకుడైన కుజుడు భాగ్యము నందు ఉండటం వల్ల, మీ కుటుంబీకులతో ఓర్పుతోనూ, నేర్పుతోనూ వ్యవహరించడం వల్ల మంచి అభివృద్ధిని పొందుతారు.
సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. 2008 నుంచి 2028 వరకు శుక్ర మహర్ధశ జరుగుతుంది. ఈ శుక్రుడు 2011 ఆగష్టు నుంచి మంచి యోగాన్ని ఇస్తాడు.