ఎన్నో అనుమానాలు... అన్నిటికీ వివరంగా చెప్పండి...
వందన:మీరు చతుర్దశి మంగళవారం కన్యాలగ్నము, అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. మీరు కార్తీక సోమవారంనాడు ఈశ్వరునికి అభిషేకం చేయించి బిల్వదళాలలో శివుని ఆరాధించండి. శేష నాగ సర్పదోషం ఉండటం వల్ల, సర్పదోష శాంతి చేయించినా శుభం కలుగుతుంది. 2011 ఆగస్టులోపు మీకు వివాహం అవుతుంది. 2012 మీ అభివృద్ధికి నాంది పలుకుతుంది. పుష్యనీలం అనే రాయిని ధరించండి. మీకు కలిసివస్తుంది. కుడివైపు ముక్కు కుట్టించుకోండి. మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.