ముత్యాన్ని ముమ్మూర్తులా పోలే విధంగా మెరిసిపోతుంటుంది ఒక నీటి మీద తామరాకు మీది నీటిబొట్టు. ఎంత భ్రాంతిని కలిగిస్తుందంటే.. అది నిజంగా ముత్యమా? అన్నట్లుంటుంది. కానీ దాన్ని ముత్యంలా ముట్టుకొని పరీక్షించలేము.
లోకంలో కొందరు ఇంతే... ముత్యంలా శుద్ధంగా స్వచ్చంగా వున్నట్లు భ్రాంతి గొల్పుతారు. తీరా వెళ్లి చూస్తే గాని ఆ రూపంలో గల అనామకులు అని తెలియదు. నిజం అనుకుంటే నీటి బిందువును ముత్యమని భ్రాంతి పడినట్లే.
ఈ లోకంలో రత్నాలు అని చెప్పదగినవి మూడంటే మూడే వున్నాయి. అవి... ఆహారం, నీరు, మంచిమాట. ఐతే మిగిలినవి ఏవేవో విలువైన లోహాలను, వజ్రవైఢూర్యాలను భ్రమచేత రత్నాలుగా భావిస్తుంటారు మూర్ఖులు.
తమను అడగకుండానే ఎవరికీ ఏమీ చెప్పకూడదు. అంతేకాదు... తెలుసుకోవాలనే శ్రద్ధాసక్తులు లేనివారికీ ఏమీ తెలియపరచకూడదు. బుద్ధిమంతుడైన వాడీ లోకం తీరు తెలిసినవాడు కనుక తనకు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లే వుంటాడు. కేవలం జడుని వలె వుండటం అతడికి మాత్రమే సాధ్యం.