Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భ్రాంతిని తొలగించేదే సాధన... స్వామి వివేకానంద

కారణమే కార్యమవుతుంది. కారణం వేరు దాని ఫలితంగా జరిగే కార్యం వేరు కాదు. క్రియగా పరిణమించిన కారణమే కార్యం. సర్వత్రా ఇదే జరుగుతూ ఉంటుంది. సర్వదా కారణమే కార్యమవుతూ ఉంటుంది. కార్యంకన్నా కారణం భిన్నమై వేరుగా ఉంటుందని, కారణం పని చేయడం వల్ల సిద్ధిస్తుందని సామ

భ్రాంతిని తొలగించేదే సాధన... స్వామి వివేకానంద
, బుధవారం, 2 ఆగస్టు 2017 (20:56 IST)
కారణమే కార్యమవుతుంది. కారణం వేరు దాని ఫలితంగా జరిగే కార్యం వేరు కాదు. క్రియగా పరిణమించిన కారణమే కార్యం. సర్వత్రా ఇదే జరుగుతూ ఉంటుంది. సర్వదా కారణమే కార్యమవుతూ ఉంటుంది. కార్యంకన్నా కారణం భిన్నమై వేరుగా ఉంటుందని, కారణం పని చేయడం వల్ల సిద్ధిస్తుందని సామాన్యంగా వ్యాపించివున్న అభిప్రాయం. ఇది యథార్థం కాదు. 
 
సర్వదా, కారణం మరొక స్థితిలో పనిచేయటం వల్లనే ఫలితం కలుగుతూ వుంటుంది. విశ్వం నిజంగా ఏక జాతీయమైనది. వైవిధ్యం స్థూలదృష్టికి కనిపించేది మాత్రమే. ప్రకృతిలో అంతటా, విభిన్నశక్తులు మెుదలైనవి ఉన్నట్లు కనిపిస్తాయి. రెండు వేరువేరు వస్తువులను తీసుకుందాం. గాజు ముక్కను, చెక్క ముక్కను తీసుకోండి. రెండిటిని పొడి చేయండి. సాద్యమైనంతా మెత్తగా పొడిచేయండి. అపుడు ఆ పదార్థలు రెండు ఏక జాతీయమైనవిగా కనిపిస్తాయి.
 
పదార్థాలన్నీ తమ అంతిమ దశలో ఏకజాతీయమైనవే. ఏక జాతీయత అసలు సత్యం. సారం, వివిధ పదార్థలుగా కనిపించే దృశ్యం వైవిధ్యం. వినుట - కనుట - రుచి చూచుట - ఇవన్నీ ఒకే మనసు వివిధావస్థలు. గదిలోని వాతవరణాన్ని మనోశక్తి వల్ల మార్చివేసి, గదిలో ప్రవేశించే ప్రతివ్యక్తీ వివిధ వైచిత్రాలను చూచేలా మనుషులు, వస్తువులూ, గాలిలో ఎగురుతున్నట్లు చూచెలా భ్రాంతి కలగవచ్చు. ప్రతి మనిషీ ఇదివరకే భ్రాంతిలో తగుల్కొని వుంటాడు. ఈ భ్రాంతిని తొలిగించుటే సాధన స్వరూప సాక్షాత్కారప్రాప్తి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిటికెన వేలితో విభూతి ధరిస్తే ఏమౌతుందంటే?