పంచారామాల్లో ఒకటైన భీమా రామమునకు రెండు కిలోమీటర్ల దూరంలో గునుపూడిలో శివలింగం వుంది. పంచరామాల్లో భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానం చాలా విశిష్టత గలిగినది. ఇక్కడి లింగము చంద్రుడు ప్రతిష్టించాడని స్థల పురాణము చెబుతున్నది.
చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతి కార్తీక మాసము అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని, అందువలన అది పంచారామాలలో ఒకటని చరత్ర చెబుతుంది. అందువలన దీనికి చంద్ర ప్రతిష్టమని పేరు వచ్చిందంట.