Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం హోలీ... రంగులు చల్లుకునేటప్పుడు....

హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం హోలీ పండుగను పాల్గుణ మాస పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం భారతదేశంలోనే కాదు, నేపాల్- శ్రీలంక- బంగ్లాదేశ్ తదితర దేశాల్లోనూ జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పేరుతో పిలుచుకుంటారు.

Advertiesment
ఆదివారం హోలీ... రంగులు చల్లుకునేటప్పుడు....
, శనివారం, 11 మార్చి 2017 (21:30 IST)
హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం హోలీ పండుగను పాల్గుణ మాస పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం భారతదేశంలోనే కాదు, నేపాల్- శ్రీలంక- బంగ్లాదేశ్ తదితర దేశాల్లోనూ జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పేరుతో పిలుచుకుంటారు. 
 
పూర్వం హిరణ్యకశిపుని కొడుకైన ప్రహ్లాదుడు నిరంతరం విష్ణువు నామస్మరణం చేయడం అతనికి నచ్చలేదు. తనకు శత్రువైన విష్ణువుకు తన కొడుకే ఈ విధంగా జపం చేయడం ఏంటని కోపంతో రగిలిపోయాడు. హిరణ్యకశిపుడు తన కొడుకును చాలాసార్లు ఈ విషయమై మందలించినా, వారించినా అతడు వినలేదు. దీంతో హిరణ్యకశిపుడు తన కుమారుడిని సంహరించమని సైనికులను ఆజ్ఞాపిస్తాడు. 
 
రాజు ఆజ్ఞానుసారంగా అనేక పద్ధతుల ద్వారా ఆ బాలుడిని చంపడానికి ప్రయత్నించినా, విష్ణు మహిమ వలన అవి వృధా అవుతాయి.   ఇక లాభం లేదని హిరణ్యకశిపుడు తన చెల్లెలు అయిన హోలిక చేతిలో కొడుకును వుంచి దహించమంటాడు. కానీ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడికి ఆ మంటలు ఏమీ చేయలేకపోయాయి. అయితే హోలిక మాత్రం అందులోనే దహనమయిపోయింది. ఈ విధంగా హోలికా దహనానికి గురయిన గుర్తుగా దక్షిణ భారతదేశంలో కామదహనం చేశారు. ఆ తరువాత రోజు పరస్పరం అందరు రంగులు జల్లుకుని ఒక వేడుకగా సంబరాన్ని చేసుకున్నారు. ఆ విధంగా హోలీ సంబరం హిందువులకు ఒక పర్వదినంగా జరుపుకోవడం ఆచారంగా మారిపోయింది.
 
హోలీ పండుగ సందర్భంగా ఉపయోగించే రంగులను కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుని, ఆ తరువాత వాడుకోవాలి. ఈ రంగులలో వుండే కొన్ని హానికరమైన రసాయన పదార్థాలు శరీర చర్మానికి హాని కలిగించవచ్చు. అలాగే ఇవి కళ్లలో పడటం వల్ల కళ్లు పోయే ప్రమాదం కూడా వుంది. హోలీ ఆడే సమయంలో కంటిలో పడకుండా ఉండేందుకు ప్రొటెక్టివ్ గ్లాసెస్ (కంటి అద్దాలు) ధరించాలి. ఘాటైన, కెమికల్ అధికంగా ఉండే రంగులకు దూరంగా ఉండాలి. పెట్రోలియం ఉత్పత్తులతో తయారుచేసిన రంగులు.. సునేర్ వంటి వాటిని వాడొద్దు. 
 
కోడిగుడ్లను వాడొద్దు. నీటిలో సునాయాసంగా కలిసిపోయే రంగులను మాత్రమే వినియోగించాలి. నీటిని బలంగా ముఖంపై చిమ్మడం వంటి పనులు చేయరాదు. రంగుల ఎలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. ప్రమాదవశాత్తు కంటిలో రంగు పడితే వెంటనే చల్లటి మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. రంగుల వల్ల కళ్ళు ఎర్రబడడం, నీళ్ళు కారడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే వాహనాలకు ప్రతి యేటా ఖర్చు రూ.30 కోట్లు...!