Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివుని మెడలోని కపాల మాల కథ గురించి...

పరమశివుని మెడలోని కపాల మాల కథను తెలుసుకోమని ఓసారి సతీదేవితో నారద మహర్షి అన్నారు. దాంతో ఓ నాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా అడుగుతారు. కపాల మాల ధరించడానికి కారణమేమిటి స్వామి అని అడిగింది. ఆ మాటను

శివుని మెడలోని కపాల మాల కథ గురించి...
, సోమవారం, 27 ఆగస్టు 2018 (14:25 IST)
పరమశివుని మెడలోని కపాల మాల కథను తెలుసుకోమని ఓసారి సతీదేవితో నారద మహర్షి అన్నారు. దాంతో ఓనాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా అడుగుతారు. కపాల మాల ధరించడానికి కారణమేమిటి స్వామి అని అడిగింది. ఆ మాటను దాట వేయడానికి పరమేశ్వరుడు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు సతీదేవి పట్టుపడుతూ తనకి ఈ విషయం గురించి చెప్పమన్నారు.
  
 
ఇక శివుడు తన మెడలోని కాపాలాలు అన్నీ సతీదేవియేనని చెబుతాడు. ఆ మాట వినగానే సతీదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇంతకుముందు సతీదేవి 107 జన్మలెత్తారు. వాటికి గుర్తుగా ధరించినదే ఈ కపాల మాలలని శివుడు చెబుతాడు.
 
అంతేకాకుండా ఈ మాలలన్నీ సతీదేవి జన్మలకు సంబంధించినవి. ఇంకొక కపాలం చేరితేనే ఆ మాల పూర్తవుతుందని పరమేశ్వరుడు చెబుతాడు. శివుని మాటలు విన్న సతీదేవి యజ్ఞకుండంలో దూకి శరీరం త్యాగం చేస్తారు. ఇక 108వ కపాలం వచ్చి చేరడంతో పరమశివుడు మెడలోని కపాల మాల పూర్తవుతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టు నూలుతో తయారైన వత్తులతో దీపం వెలిగిస్తే..?