Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి.. ఏ ముగ్గును ఎక్కడ.. ఎక్కడ వేయాలి?

ఇంటి గడప, గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగ

Advertiesment
Happy sankranthi
, శనివారం, 14 జనవరి 2017 (13:22 IST)
ఇంటి గడప, గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈవిధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతకు పూజ చేస్తున్నా దైవాన్ని వేసినా, నాలుగు వైపులా రేండేసి గీతలను తప్పక వేయాలి.
 
నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గుభూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడి ముగ్గులేయాలి. దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.
 
నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతోకూడిన ముగ్గులు వేయాలి. దేవతా రూపాలను ఓం, స్వస్తిక్‌, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆస్త్రీకి 7 జన్మల వరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి.
 
పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. ముగ్గులు రోజు వేయలేక దీర్ఘకాలం వచ్చేలా పెయింట్ వేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్‌ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి.
 
పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు లేని అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక ఆరోగ్య, ఆధ్మాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలన్నీ అనేక అర్థాలు, పరమార్థాలతో కూడినవి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి పుణ్యకాలం అంటే..!