Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల వెంకన్నకు బుల్లి అగ్గిపెట్టె చీర(వీడియో)

తిరుమల వెంకన్నకు కోట్ల రూపాయల విలువచేసే ఆభరణాలను ఇచ్చేవారు ఉన్నారు. అలాగే చిన్న బహుమతులను ఇచ్చి శ్రీవారిని ప్రార్థించేవారు ఉన్నారు. తాజాగా తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక భక్తుడు చిన్న అగ్గిపెట్టె చీరను శ్రీవారికి బహూకరించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల

తిరుమల వెంకన్నకు బుల్లి అగ్గిపెట్టె చీర(వీడియో)
, శనివారం, 24 జూన్ 2017 (14:49 IST)
తిరుమల వెంకన్నకు కోట్ల రూపాయల విలువచేసే ఆభరణాలను ఇచ్చేవారు ఉన్నారు. అలాగే చిన్న బహుమతులను ఇచ్చి శ్రీవారిని ప్రార్థించేవారు ఉన్నారు. తాజాగా తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక భక్తుడు చిన్న అగ్గిపెట్టె చీరను శ్రీవారికి బహూకరించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన విజయ్ స్వామివారి దర్శనార్థం కుటుంబ సమేతంగా వచ్చాడు. రెండు అగ్గిపెట్టెలలో శాలువా, చీర సరిపోయే విధంగా తయారు చేశాడు. ఇలా తయారుచేసిన వాటిని శ్రీవారికి కానుకగా సమర్పించాడు. విజయ్ తయారుచేసిన ఈ చీర, శాలువాను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
 
గతంలో కూడా ఉంగరం, దబ్బనంలో దూరే చీరలను నేసి స్వామివారికి ఇచ్చాడు విజయ్. స్వామివారికి చిన్న బహుమతులంటే ఇష్టమని.. అందుకే మూడునెలల పాటు కష్టపడి స్వామివారికి వీటిని సమర్పించినట్లు విజయ్ తెలిపారు. అగ్గిపెట్టెలో బుల్లి చీర, శాలువాను తయారుచేయడం ఒక రికార్డేనని, స్వామివారి దయతోనే ఇదంతా చేయగలుతున్నానంటున్నాడు విజయ్. బుల్లి అగ్గిపెట్టె చీరను చూసేందుకు భక్తులు తిరుమలలో ఎగబడ్డారు. చూడండి వీడియోను...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉమ్మెత్త పువ్వులతో శివుని పూజ ఎందుకు? ఏడు జన్మల పాపం తొలగిపోవాలంటే? మామిడి రసంతో?