Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడవారి నోటిలో నిజం దాగదు ఎందుకో తెలుసా...!

ఆడవారిని సామాన్యంగా మగవాళ్ళు 'నీ నోటిలో ఏదీ దాగదా' అని అంటుంటారు. పైగా నేను చెప్పొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎవరికి చెప్పకూడదో వారికే చెప్పావు అని కూడా అంటారు. అలా ఎందుకు వాళ్ళు అంటారు? మరీ

Advertiesment
ఆడవారి నోటిలో నిజం దాగదు ఎందుకో తెలుసా...!
, శనివారం, 21 జనవరి 2017 (11:58 IST)
ఆడవారిని సామాన్యంగా మగవాళ్ళు 'నీ నోటిలో ఏదీ దాగదా' అని అంటుంటారు. పైగా నేను చెప్పొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎవరికి చెప్పకూడదో వారికే చెప్పావు అని కూడా అంటారు. అలా ఎందుకు వాళ్ళు అంటారు? మరీ ఆడవాళ్ళు రహస్యాలను ఎందుకు దాయలేరు?
 
ఎందుకు అంటే దీని వెనుక పెద్ద కథే ఉంది. మన ఆడవారిని ధర్మరాజు శపించాడట. అలా ఎందుకు శపించాల్సి వచ్చిందో మనము తెలుసుకుందాం. కురుక్షేత్రం అయిపోయిన పిమ్మట ధర్మరాజుకు పట్టాభిషేకం అయిన తర్వాత యుద్ధంలో చనిపోయిన వారి అందరికీ ధర్మరాజు మరియు ధృతరాష్ట్రుడు నువ్వులు, నీళ్ళు వదులుతూ పిండ ప్రదానాలు చేస్తుండగా పండితులు చనిపోయిన వ్యక్తి పేరు చెప్పగానే వారు కౌరవులకు సంబంధించిన వారైతే ధృతరాష్టుడు మా వాడు అంటూ, అలాగే పాండవులకు సంబంధించిన వారి పేరు చెప్పగానే ధర్మరాజు మా వాడు అంటూ పిండ ప్రధానాలు చేస్తుండగా ఇంతలో పండితులు కర్ణుని పేరుని చదివారు. అప్పుడు ధృతరాష్టుడు నాకు సంబంధించిన వాడు కాదు అతడు అని అన్నాడు, ధర్మరాజు కూడా నాకు సంబంధం లేదు అని అన్నాడు.
 
అక్కడే ఉన్న కుంతీదేవి వెంటనే ధర్మరాజుతో కర్ణుడు నీ అగ్రజుడు అతను నీకు తెలియదని ఎలా అనగలవు? అని అడిగింది. దానికి సమాధానంగా ధర్మరాజు ఈ మాటను మీరు కురుక్షేత్ర యుద్ధం జరగక ముందు చెప్పినట్లయితే ఈ రోజున నేను ఉన్న స్థానంలో మా అగ్రజుడు అని నీవు చెబుతున్న కర్ణుడు ఉండి ఈ కార్యక్రమం నిర్వహించేవారు. అంతేకాదు ఈ రాజ్యానికి మహరాజు అయ్యేవారు. ఇప్పుడు ఇంత వినాశనం జరిగాక మీరు నిజం చెప్పడం వల్ల మీరు పొందిన లాభం ఏమిటి? మీ ఆడవారు నిజం దాచటం వల్ల ఇంత వినాశనం జరిగింది అని కోపంతో ఈ రోజు నుంచి మీ ఆడవారి నోట్లో నిజం దాగదు అని శపించారట. అప్పటి నుంచి ఆడవారి నోట్లో నిజం దాగడం లేదట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తోడేలు వంటి క్రూర జంతువుల పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకుంటే...?