Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేయండి!

కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేయండి!
, సోమవారం, 3 నవంబరు 2014 (16:42 IST)
కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. త్రిమూర్తి స్వరూపమైన సత్యనారాయణ స్వామి రామావతారంలో తన భక్తుడైన 'రత్నాకరుడు'కి ఇచ్చిన మాట కోసమే 'అన్నవరం'లోని రత్నగిరిపై ఆవిర్భవించాడు.
 
భక్తుడికి సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి వచ్చిన స్వామి, భక్తుల కష్టనష్టాలను తీరుస్తూ సత్యమహిమ కలిగిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. తపస్సుల ద్వారా తప్ప పొందలేని స్వామి అనుగ్రహం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన పొందవచ్చని పండితులు చెబుతున్నారు. 
 
సత్యనారాయణస్వామి వ్రతాన్నే సత్యవ్రతంగా కూడా పిలుస్తుంటారు. ఒకసారి సంకల్పించుకుంటే ఆ స్వామి వ్రతం చేసి తీరవలసిందే. వాయిదా వేయడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందనేది ఆ వ్రత కథల్లోనే కనిపిస్తుంది. అంకితభావంతో... నియమనిష్టలతో ఈ వ్రతం చేసినవారిని స్వామి వెంటనే అనుగ్రహిస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
 
సమస్త దోషాల నుంచి ... సమస్యల నుంచి బయటపడేసే ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే కార్తీకమాసంలో చేయడం వలన కలిగే ఫలితం విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడానికి 'కార్తీక పౌర్ణమి' మరింత విశేషమైనదిగా చెప్పబడుతోంది. 
 
కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతం చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu