Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే...

సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మీ. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయ. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి. సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. సాగరమథనంలో ఉద్భవించిన ఆమెను శ్రీమహావిష్ణువు తన హృదయేశ

Advertiesment
శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే...
, శనివారం, 16 జులై 2016 (19:19 IST)
సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మీ. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయ. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి. సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. సాగరమథనంలో ఉద్భవించిన ఆమెను శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు. లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటాం. శుచి, శుభ్రత, నిజాయితీ కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది. 
 
శ్రీ మహావిష్ణువును పూజించే వారిని అనుగ్రహిస్తుంది. అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోధిక సేవలందించిన విభీషణుడు, హనుమంతుడికి చిరంజీవులుగా వుండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు. హనుమంతుడికి భవిష్యత్‌ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం. గృహంలో ప్రశాంతత, మహిళలను గౌరవించడం, తెల్లవారుఝామునే లేవడం, పూజాధికాలను క్రమంతప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. 
 
ఇంటికి సిరి ఇల్లాలు ఆమె మనస్సును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కంట తడి పెడితే లక్ష్మీ వెళ్లిపోతుంది. అమ్మ కటాక్షం కోసం అగస్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, ఆదిశంకరాచార్యులు ఐదేళ్ల వయస్సులో ప్రార్థించిన కనకధార స్తోత్రాం, లక్ష్మీదేవి అష్టోతరాలను ప్రార్థన చేయాలి. మనకున్న దానిలో దానం చేయాలి. ఇలా చేసేవారికి లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక... కానీ...