Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శని దోషం వదిలించేందుకు ఈ చెట్టు, బిపి-చక్కెర వ్యాధులకు ఆ చెట్టు

జ్యోతిష శాస్త్రంలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత వున్నది. ఒక్కో నక్షత్రం వారు ఒక్కొక్క చెట్టును నాటిన ఎటువంటి దోషాలు వున్నా తొలగిపోతాయి. రావిచెట్టు నారాయణ స్వరూపం అని ప్రతీతి. మహానుభావులు, యోగ్యులు, విద్యావంతులు, ఋషులు, మహామునులు ఈ రావిచెట్టు క్రింద కూర్

Advertiesment
శని దోషం వదిలించేందుకు ఈ చెట్టు, బిపి-చక్కెర వ్యాధులకు ఆ చెట్టు
, శనివారం, 30 డిశెంబరు 2017 (13:55 IST)
జ్యోతిష శాస్త్రంలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత వున్నది. ఒక్కో నక్షత్రం వారు ఒక్కొక్క చెట్టును నాటిన ఎటువంటి దోషాలు వున్నా తొలగిపోతాయి. రావిచెట్టు నారాయణ స్వరూపం అని ప్రతీతి. మహానుభావులు, యోగ్యులు, విద్యావంతులు, ఋషులు, మహామునులు ఈ రావిచెట్టు క్రింద కూర్చొని తపస్సు చేసి వారు అనుకున్నది సాధించగలిగారు. వర్తమానం సాధువుల్లోనూ, పీఠాధిపతుల చేతుల్లో రావి పుల్ల వుంటుంది. 
 
ఈ రావి ఆరోగ్యాన్నిచ్చి, మానవునికి మనోధైర్యాన్ని అభివృద్ధిని ఇస్తుంది. ఆరోగ్యం బాగాలోనివారు, స్థిరబుద్ధి లేనివారు, శనిదోషంతో పీడించబడేవారు ఈ రావి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షణి చేస్తే సర్వదా శుభం కలుగుతుంది. శ్రీ కృష్ణుడు వటపత్రశాయి అనే పేరు పొందారు. శ్రీకృష్ణుడు చివరి దశలో కూడా ఈ రావి వృక్షం క్రిందే ప్రాణ త్యాగం చేశారు. అంత విశిష్టత కలిగిన ఈ చెట్టును ఆరాధించడం వల్ల, ఆరోగ్యం, అభివృద్ధి చేకూరుతుంది. 
 
ఇక వేపచెట్టు దగ్గరకు వస్తే శక్తి స్వరూపం అయిన ఈ వేప దివ్యౌషధ గుణములు కలిగినది. చక్కెర వ్యాధి, బి.పితో బాధపడేవారు, నాలుగు లేక ఐదు వేప చిగుళ్లను సూర్యోదయాధి ఘడియలకు ముందు తీసుకున్న సర్వదా శుభం కలుగుతుంది. సంతానం, కుటుంబ సౌఖ్యం లేనివారు ఈ వేపచెట్టు చుట్టూ 19 సార్లు ప్రదక్షణ చేసిన ఎటువంటి దోషాలు వున్నా తొలగిపోతాయి. సర్ప దోషాలతో బాధపడేవారు, రావి, వేపచెట్టుకు ప్రదక్షిణ చేసిన ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. వృక్షో రక్షతి రక్షితః అన్నట్లుగా ప్రతి నక్షత్రం వారు ఈ క్రింది చూపిన చెట్లను దేవాలయాల్లోకానీ, ఉద్యాన వనాల్లో కానీ, ఖాళీ స్థలాల్లో నాటి వాటి పురోభివృద్ధికి పాటుపడితే సర్వదా శుభం కలుగుతుంది. 
 
అశ్వని నక్షత్రం వారు జీడిమామిడి చెట్టు.
భరణి నక్షత్రం వారు దేవదారు చెట్టు.
కృత్తిక నక్షత్రం వారు అత్తి చెట్టు.
రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టు.
మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టు.
ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టు.
పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టు.
పుష్యమి నక్షత్రం వారు పిప్పిలి చెట్టు.
ఆశ్లేష నక్షత్రం వారు బొప్పాయి చెట్టు.
మఖ నక్షత్రం వారు మర్రి చెట్టు.
పుబ్బ నక్షత్రం వారు మోదుగ చెట్టు.
ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టు.
హస్తా నక్షత్రం వారు కుంకుడు చెట్టు.
చిత్త నక్షత్రం వారు తాటి చెట్టు.
స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టు.
విశాఖ నక్షత్రం వారు మొగలి చెట్టు.
అనూరాధ నక్షత్రం వారు పొగడ చెట్టు.
జ్యేష్ట నక్షత్రం వారు కొబ్బరి చెట్టు.
మూల నక్షత్రం వారు వేగి చెట్టు.
పూర్వాషాడ నక్షత్రం వారు నిమ్మ చెట్టు.
ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టు.
శ్రవణా నక్షత్రం వారు జిల్లేడు చెట్టు.
ధనిష్టా నక్షత్రం వారు జమ్మి చెట్టు.
శతభిష నక్షత్రం వారు అరటి చెట్టు.
పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు.
ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టు.
రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును నాటిన శుభం కలుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2018లో మీన రాశి వారి ఫలితాలు...