Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ సంప్రదాయంలో వివాహం ఎన్ని రకాలు?

Advertiesment
వివాహం
File
FILE
సాధారణంగా వివాహం అంటే యువతీ యువకుడు అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లాడటమన్నది సంప్రదాయం. అలాంటి వివాహం మన శాస్త్ర, పురాణాల్లో ఎనిమిది రకాలుగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి!!

ఈ వివాహం అనేది ఎనిమిది రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి.. బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని పేర్లు ఉన్నాయి. వీటిలో మొదటిది బ్రహ్మ వివాహం. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు.

అలాగే, రెండోది దైవ వివాహం. యజ్ఞంలో రుత్విక్‌‌కు అలంకరించిన కన్యాదానంగా చెపుతారు. గోమిధునాన్ని వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెపుతారు. మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.

అదేవిధంగా జ్ఞానులు కన్యకు తన శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా పేర్కొంటారు. వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెపుతారు. బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే దాన్ని రాక్షస వివాహంగా పేర్కొంటున్నారు. నిద్రిస్తున్న మత్తులో ఉన్న స్త్రీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే దాన్ని పైశాచ వివాహంగా పేర్కొంటారు.

Share this Story:

Follow Webdunia telugu