అష్టదిక్పాలకులెవరు, వారి భార్యల పేర్లు ఏమిటి...?
, ఆదివారం, 3 మార్చి 2013 (10:19 IST)
తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు, దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. నైఋతి దిక్కుకు అధిపతి నిర్భతి, పడమర దిక్కుకు అధిపతి వరుణుడు, వాయువ్య దిక్కుకు అధిపతి వాయుదేవుడు, ఉత్తరదిక్కుకు అధిపతి కుబేరుడు, ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశానుడు. ఇంద్రుని భార్య శచీదేవి, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి, యముని భార్య శ్యామలాదేవి, నిర్భతి భార్య దీర్ఘదేవి, వరుణుని భార్యపేరు కాళికాదేవి. వాయుదేవుని భార్య అంజనాదేవి, కుబేరుని భార్య చిత్రరేఖనాదేవి, ఈశానుని భార్య పార్వతీదేవి. వీరు అష్టదిక్పాలకుల భార్యలు.