Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీఏ రైల్వే ప్రాజెక్టులు 99.. ఒకటి పూర్తి.. అవినీతి కంపు!

Advertiesment
యూపీఏ రైల్వే ప్రాజెక్టులు 99.. ఒకటి పూర్తి.. అవినీతి కంపు!
, మంగళవారం, 8 జులై 2014 (14:55 IST)
గత యూపీఏ ప్రభుత్వం పదేళ్ళ కాలంలో మొత్తం 99 ప్రాజెక్టులను ప్రతిపాదించింది. వీటిలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేయగా, మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. పైపెచ్చు.. ఈ ప్రాజెక్టుల్లో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకున్నట్టు సోమవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. 
 
యూపీఏ ప్రవేశపెట్టిన ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.60 వేల కోట్లని తెలిపారు. అంతేకాకుండా, గత 30 యేళ్ళలో మొత్తం 676 ప్రాజెక్టులను ప్రకటించారు. వీటి మొత్తం విలువ రూ.157883 కోట్లు. అయితే, వీటిలో 317 ప్రాజెక్టులను పూర్తి చేయగా, 359 ప్రాజెక్టులను పూర్త చేయాల్సి వుంది. ప్రతి రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టును ప్రవేశపెట్టడమే కానీ వాటిని పూర్తి చేసే అంశంపై ఎవరూ కూడా దృష్టిసారించలేదని విమర్శించారు. వీటిని పూర్తి చేయాలంటే వచ్చే పదేళ్ళలో 50 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu