Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త రైళ్లు ఎన్ని... సదానంద రైల్వే బడ్జెట్‌ హైలెట్స్...

Advertiesment
కొత్త రైళ్లు ఎన్ని... సదానంద రైల్వే బడ్జెట్‌ హైలెట్స్...
, మంగళవారం, 8 జులై 2014 (13:55 IST)
లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కొత్తగా ఐదు జనసాధారణ్, 5 ప్రీమియం, 27 ఎక్స్‌ప్రెస్, 6 ఏసీ, 8 ప్యాసింజర్, రెండు మెమో, ఐదు డెమో రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు కేంద్రమంత్రి సదానందగౌడ లోక్ సభలో ప్రకటించారు. అయితే, ఉమ్మడి రాజధాని హైదరాబాదుకు రెండు సెమీ బులెట్ రైళ్లను మంత్రి ప్రకటించారు. ఇందులో ఒక రైలు చెన్నై-హైదరాబాద్ మధ్య, రెండో రైలు విజయవాడ-హైదరాబాదు మధ్య సెమీ బులెట్ రైళ్లు వేస్తున్నట్టు తెలిపారు. ఇంకా బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 
 
* విజయవాడ-న్యూఢిల్లీ మధ్య ఏపీ ఎక్స్ ప్రెస్
* విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్
* సికింద్రాబాద్-నిజాముద్దీన్ మధ్య ప్రీమియం రైలు
* ముంబై-గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్
* నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బులెట్ రైలు కేటాయించినట్టు చెప్పారు
* పారాదీప్-విశాఖపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్ 
* 2014-15 ఆదాయం అంచనా రూ. 1,64,000 కోట్లు. 
* ఛార్జీల పెంపుతో రూ. 8 వేల కోట్ల ఆదాయం 
* అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు.
* వృద్ధులు, వికలాంగుల కోసం రైల్వే స్టేషన్లలో బ్యాటరీ వాహనాలు. 
* స్టేషన్లలో శుభ్రతను పరిశీలించేందుకు సీసీటీవీలు. 
* ప్రధాన రైళ్లలో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సౌకర్యాలు. 
* కోచ్, రైలును కూడా బుక్ చేసుకునే అవకాశం. 
* డబ్లింగ్, ట్రిప్లింగ్ లకు మొదటి ప్రాధాన్యత. 
* కొత్త రైల్వే లైన్లకు రెండో ప్రాధాన్యత. 
* ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత. 
* 50 మేజర్ స్టేషన్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పారిశుధ్యత కార్యక్రమాలు.
* ఆర్పీఎఫ్ సిబ్బందికి మొబైల్ ఫోన్లు. 
* రైల్వే సిబ్బంది సంక్షేమ నిధి రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెంపు. 
* త్వరలోనే ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు. 
* రూ.100 కోట్లతో ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ నెట్ వర్క్ 
* భద్రత కోసం త్వరలోనే 17000 ఆర్పీఎఫ్ సిబ్బంది. 
* కాపలాలేని 5400 రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల మూసివేత.
* రైళ్లలో మహిళల భద్రత కోసం 4 వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియామకం.
* రైల్వే యూనివర్శిటీ స్థాపన 
* ఆన్‌లైన్ ద్వారా ప్రయాణ, ప్లాట్ ఫాం టికెట్ల విక్రయం. 
* పోస్టాఫీసుల్లో రైల్వే రిజర్వేషన్ సౌకర్యం 
* ఐదేళ్లలో పేపర్ లెస్ కార్యాలయాలు. 
* పార్కింగ్, ప్లాట్ ఫాం కాంబో టికెట్ల విక్రయాలు. 
* విమానాశ్రయాల స్థాయిలో ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ. 
* ఎంపిక చేసిన రూట్లలో రైళ్ల వేగం గంటకు 160-200 కి.మీటరకు పెంపు.
* 10 మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాం. 
* ఎ-1 స్టేషన్లు, ఎ-1 రైళ్లలో వైఫై సౌకర్యం. 

Share this Story:

Follow Webdunia telugu