Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారినలా చూసిన దగ్గర్నుంచి నాకు పెళ్లంటే భయమేస్తోంది...

నాకో భయం పట్టుకుంది. కాలేజీ చదివే రోజుల్లో పక్కింటి ఆంటీ వాళ్ల ఇంటికి పనిమీద వెళ్లాను. ఆ సమయంలో ఆమె అంకుల్‌తో రతి చేస్తుండటాన్ని పొరపాటున చూసాను. అతడు ఆమెపై పాశవికంగా ప్రవర్తిస్తూ ఏదేదో చేశాడు. అదంతా చెప్పలేను. కానీ ఆ జ్ఞాపకం నన్ను వదలడంలేదు. నాకు పె

Advertiesment
psychology
, బుధవారం, 5 ఏప్రియల్ 2017 (19:43 IST)
నాకో భయం పట్టుకుంది. కాలేజీ చదివే రోజుల్లో పక్కింటి ఆంటీ వాళ్ల ఇంటికి పనిమీద వెళ్లాను. ఆ సమయంలో ఆమె అంకుల్‌తో రతి చేస్తుండటాన్ని పొరపాటున చూసాను. అతడు ఆమెపై పాశవికంగా ప్రవర్తిస్తూ ఏదేదో చేశాడు. అదంతా చెప్పలేను. కానీ ఆ జ్ఞాపకం నన్ను వదలడంలేదు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లయిన తర్వాత నాకు కాబోయే భర్త కూడా అలాగే ప్రవర్తిస్తాడేమో అని భయంగా ఉంది. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉందామనే భావన కూడా కలుగుతోంది... ఏం చేయాలి?
 
ఇలాంటి అనుకోని సంఘటనలు కొందరి జీవితాల్లో ఎదురవుతుంటాయి. రతి సమయంలో భార్యభర్తల ప్రవర్తనలో ఒక కోణాన్ని మాత్రమే మీరు చూసి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ఆ ఆంటీని ఆ అంకుల్ ఎలా చూసుకుంటున్నారనేది మీరు వివరించలేదు. పడకగది శృంగారం అనేది భార్యభర్తల మధ్య భిన్న రీతుల్లో ఉంటుంది. 
 
అది ఆస్వాదించే జంటలను బట్టి అక్కడి వాతావరణం ఉంటుంది. అందువల్ల రతి గురించి అంతగా భయపడాల్సిన పనిలేదు. జంటలు పరస్పరం అవగాహన చేసుకున్న తర్వాతే సెక్సులో ఉపక్రమిస్తారు. సుఖాన్ని చవిచూస్తారు. రతి సుఖం తారాస్థాయికి వెళ్లినప్పుడు దంపతుల ప్రవర్తన ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కనుక దాని గురించి ఆందోళన చెందవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడిగుడ్లను, బచ్చలికూరను వేడి చేయకూడదు: చికెన్.. మష్రూమ్స్ కూడా?