Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ప్రేయసి నా భార్యతో అతుక్కుపోయి తిరుగుతోంది... నిజం చెప్పేస్తుందేమో?

నా ప్రేయసి నా భార్యతో అతుక్కుపోయి తిరుగుతోంది... నిజం చెప్పేస్తుందేమో?
, మంగళవారం, 22 జనవరి 2019 (11:38 IST)
కొన్ని అనుకోని కారణాల వల్ల నా ప్రేయసిని కాక మరో అమ్మాయిని పెళ్లాడాను. పెళ్లయి 5 ఏళ్లు గడిచింది. మొన్నీమధ్య ఊరెళుతుంటే నా ప్రేయసి కనబడింది. కోపంతో నన్ను తిడుతుందనుకున్నాను. కానీ చాలా ప్రశాంతంగా మా యోగక్షేమాలు అడిగింది. కాఫీ తాగి వెళ్లమని అడిగితే కాదనలేక ఇంటికి వచ్చింది. ఆమె ఎవరని నా భార్య అడిగితే, మా ఆఫీసులో కొలీగ్ అని చెప్పా. అలా చెప్పినప్పుడే ఆమె నన్ను ఏదయినా అంటుందేమో అనుకున్నా. కానీ నన్ను ఏమీ అనలేదు.
 
ఐతే ఈమధ్య నా ప్రేయసి నాకు తెలియకుండా మా ఇంటికి తరచూ వస్తోందని నా భార్య మాటలతో తెలుసుకున్నాను. నా భార్యతో చాలా స్నేహంగా ఉంటోంది. ఇద్దరూ అతుక్కుపోయి తిరుగుతున్నారు. నా ప్రేయసి మా ఇద్దరి మధ్య ఉన్న లవ్ ఎఫైర్ గురించి చెప్పేస్తుందేమోనన్న భయం పట్టుకుంది. ఆమె చెప్పేసిందో లేదో తెలియదు కానీ నేనే అసలు సంగతి చెప్పేద్దామనుకుంటున్నా. చెబితే ఏమయినా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది... ఏంటి మార్గం...?
 
ప్రేమ, ప్రేయసి వ్యవహారం చాలా సున్నితమైనది. ఇపుడు ఆమె ఇంటికి వస్తుండేసరికి మీకు భయం పట్టుకున్నది. మాజీ ప్రేమికురాలితో రొమాన్స్ చేసిన విషయాలు, ప్రేమబంధం గురించి చెబితే ఏ భార్య కూడా సహించలేదు. ఐతే మీ భావాలు, మనసు అర్థం చేసుకోగల స్త్రీ అయితే తప్పకుండా ఆ వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. 
 
కానీ మీ ప్రేయసిపై మీకు అంత అపనమ్మకం ఎందుకు కలిగినట్లు...? మీరు మరొకర్ని పెళ్లాడిన తర్వాత మీమధ్య జరిగిన ప్రేమ చరిత్రను తవ్వితీసి మీ భార్య ముందు పెట్టి మీకు అపకారం చేయాలనుకునే స్వభావంతో ఆమె ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే ప్రేమించి ఆమెను పెళ్లాడకుండా ఆమెకు అన్యాయం చేశారు. మరోసారి ఆమె గురించి తప్పుగా సంకేతాలు వెళితే ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టినట్లవుతుంది. కనుక ఆమెను మంచి కుటుంబ స్నేహితురాలిగా చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుణవంతునకు తన స్నేహితుడైనవాడు ప్రేమతో...?