Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి సమస్య... 27 ఏళ్ల అబ్బాయిని పెళ్లాడాలని... నాకు 34 ఏళ్లు... ఏమవుతుంది?

మా ఇంటికి పెద్ద దిక్కు నేనే. పెద్ద కుమార్తెను. నాన్నగారు అకస్మాత్తుగా చనిపోయారు. అప్పటివరకూ ఎలాంటి లోటు లేకుండా ఉన్న మాకు కష్టాలు మొదలయ్యాయి. జస్ట్ డిగ్రీ పూర్తవగానే ఆయన చనిపోవడంతో భారమంతా నాపైనే పడిం

పెళ్లి సమస్య... 27 ఏళ్ల అబ్బాయిని పెళ్లాడాలని... నాకు 34 ఏళ్లు... ఏమవుతుంది?
, సోమవారం, 16 మే 2016 (15:43 IST)
మా ఇంటికి పెద్ద దిక్కు నేనే. పెద్ద కుమార్తెను. నాన్నగారు అకస్మాత్తుగా చనిపోయారు. అప్పటివరకూ ఎలాంటి లోటు లేకుండా ఉన్న మాకు కష్టాలు మొదలయ్యాయి. జస్ట్ డిగ్రీ పూర్తవగానే ఆయన చనిపోవడంతో భారమంతా నాపైనే పడింది. నా తర్వాత ఒక చెల్లి, ఒక తమ్ముడు. వారి బాధ్యతతో పాటు అమ్మను చూసుకుంటూ 22 ఏళ్ల వయసు నుంచి 34 ఏళ్లు వచ్చేవరకూ వారితోటిదే లోకంగా గడిపేశాను. నా సోదరి, సోదరుడు సెటిలయ్యారు. నా పెళ్లి గురించి వారు చాలాసార్లు ఒత్తిడి చేశారు కానీ నాకెవరూ నచ్చలేదు. పైగా వచ్చిన సంబంధాల్లో ఎక్కువగా విడాకుల సంబంధాలే వచ్చాయి. 
 
విడాకులు తీసుకున్నవారు నన్ను పెళ్లాడుతానంటూ ముందుకు వచ్చినవారిలో ఉన్నారు. కానీ నేను అంగీకరించలేదు. ఐతే గత ఆరు నెలల క్రితం మా ఆఫీసులో 27 ఏళ్ల యువకుడు చేరాడు. చాలా మంచివాడు. నా పరిస్థితి గురించి ఏమాత్రం అడిగేవాడు కాదు. కానీ నా మంచిచెడ్డలు గురించి వాకబు చేస్తూ ఉండేవాడు. అలా అతడితో స్నేహం కుదిరింది. మొన్నీమధ్య తన మనసులో మాట బయటపెట్టాడు. నన్ను పెళ్లాడుతానంటున్నాడు. కానీ అతడికి నాకు మధ్య వయసు తేడా ఏడేళ్లు ఉంది. ఇదే అసలు సమస్య. నాక్కూడా అతడి పైన మనసు పోతుంది. అతడి మంచితనం, మాటలు నన్ను కట్టిపడేశాయి. అతడితో జీవితం పంచుకోవాలని అనిపిస్తోంది. కానీ వయసు తేడా వల్ల పెళ్లయ్యాక సమస్యలేమైనా వస్తాయేమోనని భయంగా ఉంది. ఏం చేయాలో తెలియడంలేదు.
 
పురుషుడికి ఎక్కువ వయసు, స్త్రీకి తక్కువ వయసు అనేది అనాదిగా వస్తున్నదే. దీనికి కారణం లేకపోలేదు. వయసురీత్యా పురుషుడు కుటుంబ భారాన్ని మోసే చాకచక్యంతోపాటు దాంపత్యరీత్యా కూడా ఈ తేడా ఉండాల్సిందేనని పలు నిదర్శనాలున్నాయి. స్త్రీలు 45 నుంచి 50 ఏళ్లకే మెనోపాజ్ దశకు చేరుకుంటారని వైద్యులు చెపుతుంటారు. ఐతే పురుషులు 60 ఏళ్ల వరకూ లైంగిక క్రియలో సమర్థవంతంగా ఉంటారనే వాదన కూడా ఉంది. వీటన్నిటికీ మించి సమాజంలో ఇలా వయసు తేడాతో పెళ్లయినవారి వ్యవహారంలో ఒకరకమైన భావనతో చూస్తుంటారు. కానీ వీటిని అధిగమించి కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. పరస్పరం ఇలాంటి విషయాలను చర్చించుకుని ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే టెక్నిక్స్... ఇవిగోండి...