Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమెకు పెళ్లయినా ప్రేమిస్తున్నానేంటి...? రెండేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు...

నా మానసిక పరిస్థితి ఏమిటో ఓ పట్టాన అర్థం కావడంలేదు. ఇటీవలే మా ఇంటికి ఎదురుగా ఓ పెళ్లయిన జంట అద్దెకి దిగారు. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. విచిత్రమేమిటంటే... ఆమెను చూసిన మరుక్షణమే ఆమెంటే నాకు ఎంతో

ఆమెకు పెళ్లయినా ప్రేమిస్తున్నానేంటి...? రెండేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు...
, శనివారం, 4 జూన్ 2016 (15:05 IST)
నా మానసిక పరిస్థితి ఏమిటో ఓ పట్టాన అర్థం కావడంలేదు. ఇటీవలే మా ఇంటికి ఎదురుగా ఓ పెళ్లయిన జంట అద్దెకి దిగారు. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. విచిత్రమేమిటంటే... ఆమెను చూసిన మరుక్షణమే ఆమెంటే నాకు ఎంతో ఇష్టం ఏర్పడింది. రోజూ ఆమెను చూడనిదే ఉండలేకపోతున్నాను. ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. ఓ రోజు ధైర్యం చేసి వారి ఇంటికి వెళ్లాను. ఆమె ఇంట్లో బాబును ఆడిస్తూ ఉంది. నన్ను చూసి ఏంటి అని అడిగింది. ఊరికినే మేడం... రావాలనిపించి వచ్చాను అని చెప్పాను. 
 
అవునా.. అంటూ బాబును నా చేతికి ఇచ్చింది. కాసేపు వాడితో ఆడుకున్నాను. కానీ నా చూపులన్నీ ఆమె పైనే ఉన్నాయి. లోనికి వెళ్లి జ్యూస్ తెచ్చి ఇచ్చింది. తాగాను. ఆ తర్వాత కూడా పిల్లాడితో ఆడుకుంటూ ఆమెనే గమనిస్తున్నాను. ఆమె నా పరిస్థితి గమనించినట్లుంది. సరే.. నాకు ఇంట్లో పనుంది. వెళతావా అంది. వచ్చేశాను. కానీ రోజూ ఏదో వంకతో ఆమె వద్దకు వెళుతూనే ఉన్నాను. ఆమెను అలా చూడకూడదని తెలిసినా నా ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నాను. ఆమె నాక్కావాలనిపిస్తోంది. కానీ ఇది తప్పు అని తెలిసినా ఉండలేకపోతున్నాను. ఏం చేయాలి?
 
పెళ్లయిన స్త్రీ పట్ల అలాంటి ఊహలు రావడం కరెక్ట్ కాదు. ఐతే కొందరు యువకుల్లో ఇలాంటి ఆలోచనలు చెలరేగడం జరుగుతుంటుంది. వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఓ స్త్రీ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని కాపురం సాగిస్తున్నప్పుడు ఆమెపై మనసు పడటం అసాధారణమైన విషయంగా చూడాల్సి ఉంటుంది. ఆమె పట్ల మీకు ఉన్న ఆకర్షణకు ఫుల్ స్టాప్ పెట్టేయండి. అలాంటి ఊహలు వస్తున్నప్పుడు పుస్తకాలను చదవడమో, లేదంటే మరే ఇతర వ్యాపకంలోకి వెళ్లడమో చేయండి. అంతేతప్ప... ఆమె ఇంటికి వెళ్లి లేనిపోని అనుమానాలకు తావివ్వవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసి రసంతో నిద్రలేమికి చెక్...