Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోపాన్ని తగ్గించుకోవాలంటే..? ఆయిలీ ఫుడ్ తీసుకోకూడదు.. కారాన్ని తగ్గించండి

కోపం తగ్గితే మానసిక ఆందోళన చాలామటుకు తగ్గిపోతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తవు. హృద్రోగ సమస్య, డయాబెటిస్ సమస్యలకు దూరంగా వుండొచ్చు. ఒత్తిడికి చెక్ పెట్టొచ్చు. కోపాన్ని తగ్గించుకోవాలంటే.. అతిగా వాదించకూడ

Advertiesment
కోపాన్ని తగ్గించుకోవాలంటే..? ఆయిలీ ఫుడ్ తీసుకోకూడదు.. కారాన్ని తగ్గించండి
, గురువారం, 3 ఆగస్టు 2017 (11:34 IST)
కోపం తగ్గితే మానసిక ఆందోళన చాలామటుకు తగ్గిపోతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తవు. హృద్రోగ సమస్య, డయాబెటిస్ సమస్యలకు దూరంగా వుండొచ్చు. ఒత్తిడికి చెక్ పెట్టొచ్చు. కోపాన్ని తగ్గించుకోవాలంటే.. అతిగా వాదించకూడదు. ఎవరిపైనా దాడి చేసే ప్రయత్నం కూడా చేయకూడదు. ఎప్పుడూ మధురంగా మాట్లాడటం నేర్చుకోవాలి. అసభ్య పదజాలానికి దూరంగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. ఎవరైనా నిందిస్తే మౌనంగా ఉండిపోవాలి. నిందించేవాళ్లూ మనవాళ్లే కదా అంటూ తలచుకుంటే కోపం పూర్తిగా తగ్గిపోతుంది.
 
లక్ష్యాన్ని చేరుకునేందుకు ఒక మార్గంలో కష్టమైతే మరో మార్గాన్ని ఎంచుకోవాలి. అంతేగానీ, పక్కకు వెళ్లిపోకూడదు. అనుక్షణం అడ్డంకుల్ని అధిగమించి లక్ష్యాన్ని చేరే అంశం మీదే మనసు నిలిపితే కోపతాపాలన్నీ అదృశ్యమైపోతాయి. మనసును నియంత్రించడంలో ప్రాణాయామం ఎంతో కీలక భూమికను నిర్వహిస్తుంది ప్రాణాయామం అతిభాషణను నియంత్రిస్తుంది. అది కోపాన్ని నియంత్రించుకోగలిగే అపారమైన శక్తిని పెంచుతుంది. 
 
సాత్వికాహారానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలి. మెదడును దెబ్బతీయని ఆహారం తీసుకోవాలి. మాంసాహారాన్ని వారానికి ఎక్కువసార్లు తీసుకోకూడదు. కారం, నూనె ఎక్కువగా ఆహారాన్ని పక్కనబెట్టేయాలి. కోపంతో హృద్రోగాలు, గుండెపోటు, వ్యాధినిరోధక తగ్గడం, చర్మసమస్యలు, హైబీపీ, అజీర్ణ సమస్యలు, మానసిక ఒత్తిడి, మైగ్రేన్స్ వంటివి తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అందుచేత కోపం తగ్గాలంటే.. రోజూ ఓ రెండు గంటల పాటు నిశ్శబ్దాన్ని పరిశీలించడంలో గడపాలి. అప్పుడప్పుడు మొత్తం రోజంతా నిశ్శబ్దంగా గడపడానికి ప్రయత్నించాలి. భావోద్వేగానికి లోనయ్యే దశలో ముందు శరీరాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఫలితంగా మనసు అదుపులోకి వస్తుంది. శరీర నియంత్రణ నిజంగా ఆత్మశక్తి పెంచుకునేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. సాధ్యమైనంత వరకు సహన శక్తిని పెంచుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోలేకపోతే.. ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోవడం మంచిది. మనస్సును ప్రేమ, ఆనందపరమైన భావాలతో నింపుకుంటే కోపం మాయమవుతుందని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గసగసాలను పాలతో నూరి.. తలకు లేపనం వేస్తే?