Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో అర్చిస్తే..?

Advertiesment
Significance of rose puja for Lakshmi devi
, సోమవారం, 22 డిశెంబరు 2014 (18:51 IST)
లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు లభించినట్లే. సకలసంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి అందరిపట్ల ఎంతో దయకలిగి ఉంటుంది. అందరినీ చల్లగా చూడటం కోసమే ఆరాటపడుతూ ఉంటుంది. కాకపోతే తాను ఉండాలనుకునే చోట ప్రశాంతత ... పవిత్రత ఉండాలని కోరుకుంటుంది. 
 
అందుకే పనికిరాని వస్తువులు ... అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని పెద్దలు చెబుతుంటారు. అలాంటివి లేకుండా పరిశుభ్రంగా ఉండే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక అడుగుపెడుతుందని అంటారు. అలా వచ్చిన అమ్మవారి మనసు గెలుచుకోవాలంటే అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని 'గులాబి' పూలతో అర్చిస్తూ ఉండాలి.
 
అమ్మవారికి గులాబీలు ఎంతో ప్రీతికరమైనవి. ఈ పూలతో ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడం ఆ తల్లికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సంతృప్తి చెందిన అమ్మవారు తన భక్తులను ఆనందంతో అనుగ్రహిస్తుంది. ఫలితంగా ఆదాయమార్గాలు పెరిగి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu