Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

గ్రహ సంబంధమైన దోషాల తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

Advertiesment
Significance
, బుధవారం, 20 మార్చి 2019 (11:49 IST)
హిరణ్యకశిపుని వలన ప్రహ్లాదుడికి కలిగిన కష్టాల నుంచి విముక్తిని కలిగించడం కోసం, అసురుడైన హిరణ్యకశిపుడి బారి నుంచి సాధుసజ్జనులను రక్షించేందుకుగాను శ్రీమహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించారు. అసురసంహారం అనంతరం ఆ ఉగ్రరూపంలోనే స్వామి అనేక ప్రాంతాలలో తిరుగాడుతూ కొండగుహలలో ఆవిర్భవించారు.
 
ఈ కారణంగానే స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించిన ఎక్కువ క్షేత్రాలు గుట్టలపైనా.. గుహల్లోనూ కనిపిస్తుంటాయి. స్వామివారిది ఉగ్రరూపుడైనప్పటికీ.. భక్తుల పట్ల నరసింహస్వామి చల్లని చూపు చూస్తాడని పండితులు చెప్తున్నారు. 
 
నరసింహస్వామిని పూజించడం వలన దుష్టశక్తుల వలన కలిగే బాధలు దూరమైపోతాయి. గ్రహ సంబంధమైన దోషాల వలన పడుతోన్న ఇబ్బందులు తొలగిపోతాయి. తనని ఆరాధించేవారికి స్వామి ధైర్యాన్ని వరంగా ప్రసాదిస్తాడట. ధైర్యమనేది ఒక తెగింపుతో అడుగుముందుకు వేసేలా చేస్తుంది. సంశయమనేది లేకుండా ధైర్యంతో చేసే పనులు సఫలీకృతమవుతాయని చెప్పబడుతోంది.
 
లోకక‌ళ్యాణ కారకుడైన నరసింహస్వామిని పూజించడం వలన గ్రహపీడలు, దుష్టప్రయోగాలు నశిస్తాయి. ధైర్యం, విజయం, సంపద, సంతోషం ఒక్కొక్కటిగా చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-03-2019 బుధవారం దినఫలాలు - మేషరాశివారు అలా చేస్తే...