Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏలినాటి శనిదోషాలు తొలగిపోవడానికి ఇలా పూజలు చేస్తే?

శని అనే మాట వినగానే అందరిలో అలజడి మెుదలవుతుంది. సాధారణ మానవులే కాదు దేవతలు కూడా శనీశ్వరుడంటే భయపడుతుంటారు. శని దేవునికి శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున శనీర్వునికి పూజలు చేయడం వలన శనిగ్రహదోషాల

ఏలినాటి శనిదోషాలు తొలగిపోవడానికి ఇలా పూజలు చేస్తే?
, శనివారం, 1 సెప్టెంబరు 2018 (11:52 IST)
శని అనే మాట వినగానే అందరిలో అలజడి మెుదలవుతుంది. సాధారణ మానవులే కాదు దేవతలు కూడా శనీశ్వరుడంటే భయపడుతుంటారు. శని దేవునికి శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున శనీర్వునికి పూజలు చేయడం వలన శనిగ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. అయితే కొంతమంది శని త్రయోదని రోజున శని దేవుడిని ఎందుకు పూజించాలనే సందేహం కలుగుతుంటుంది.
 
అందుకు ముఖ్యకారణం సూర్యుడు - సంజ్ఞాదేవి దంపతులకు వైవస్వతుడు, యమధర్మరాజు జన్మించారు. సూర్యుని వేడిని భరించలేని సంజ్ఞాదేవి తన నీడకి ప్రాణం పోసి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ నీడనే ఛాయాదేవి అని పిలుస్తుంటారు. సూర్యుని వలన ఆమె సావర్ణి మనువుకు శనీశ్వరునికి జన్మనిచ్చింది. ఆ రోజే శని త్రయోదశి. ఈ కారణంగానే శనివారంతో కూడిన ఈ త్రయోదశి రోజున శని దేవునికి పూజలు చేస్తుంటారు.
 
ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శనిశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అదే నూనెతో అభిషేకం చేయాలి. ఆ తరువాత నువ్వుల నూనెతో వంటకాలు తయారుచేసి ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. ఇదే రోజున నువ్వులను, నల్లని వస్త్రాలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన వాహనమైన కాకికి ఈ రోజున ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. 
 
ఏలినాటి శనిదోషాలలో బాధపడుతున్నవారు వరుసగా 13 శనివారాలు శనిదేవునికి పూజలు చేయవలసి ఉంటుంది. ఇలా ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరునికి దీపారాధనలు, నైవేద్యాలు పెట్టడం వలన ఏలినాటి శనిగ్రహాదోషాలు తొలగిపోతాయని పురాణంలో చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి శనివారం రోజున హనుమంతునికి సింధూరాభిషేకం చేయించడం కూడా మంచి ఫలితం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు 1వ తేదీ శనివారం దినఫలాలు - స్త్రీల తొందరపాటుతనం వల్ల...