Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గడియారం గంటలు కొడుతున్నట్లు కలగంటే..?

Advertiesment
What Do Clocks Mean In Dreams?
, శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:50 IST)
గడియారం గంటలు కొడుతున్నట్లు కల వచ్చినట్లైతే సంతాన లాభము, శుభప్రదమైన జీవనము కలుగును. గడియారం కలలో చూచుట వల్ల అనేక పనులు ఆటంకము లేకుండా నెరవేరును. ఇనుము కలలో కనిపిస్తే దారిద్ర్యము సంభవించును. వెండిముద్ద కలలో చూసిన అపకారము కలుగును.
 
ఇతరులకు వివాహము జరుగుచున్నట్లు కల వచ్చినట్లైతే తనకు మంచి అభివృద్ధి కలుగును. తాను ప్రేమించిన స్త్రీతో వివాహము జరుగుటకు ప్రయత్నములు ప్రారంభమగును. నువ్వులు, నువ్వుల నూనె కలలో కనిపించినట్లైతే అనేక కష్ట నష్టాలు తప్పవు. అగాధంలో పడినట్లు కల వచ్చినట్లైతే అనుకోని అదృష్టము కలిసి వచ్చును.  
 
అత్తరు వాసన చూసినట్లు కల వచ్చినట్లైతే తెలియని రహస్యములు తెలియవచ్చును. అనాధ బిడ్డ దొరికినట్లు కల వచ్చినట్లైతే జీవితములో దొరకని మనసుకు ఉల్లాసము కలుగును.

Share this Story:

Follow Webdunia telugu